పిల్లల శిక్షణ ఇమాం బాఖిర్[అ.స] దృష్టిలో

బుధ, 02/28/2018 - 19:40

పిల్లల పెంపకం మరియు పోషణలో తల్లితండ్రులు కీలక పాత్రను పోషిస్తారు,చిన్ననాటి నుండే వారికి మంచి శిక్షణ ఇవ్వడం ఆ తల్లి తండ్రుల కర్తవ్యం, అల్లహ్ వద్ద దీని ప్రతిఫలం వెలకట్టలేనిది.

పిల్లల శిక్షణ ఇమాం బాఖిర్[అ.స] దృష్టిలో

విద్య మరియు మంచి శిక్షణ మానవుని ప్రాధమిక అవసరాలలో ముఖ్యమైనవి,ఇవి లేకుండా ఇహపరలోకాలలో సాఫల్యం సాధించటం అసాధ్యం,మానవుని జీవితంలో ఇతర అంశాలవలె విద్య మరియు మంచి శిక్షణ కూడా అవసరమని ఇమాములు [ఉత్తరాధికారులు] తాకీదు చేయటం జరిగింది.
పుట్టుక నుండే జాగ్రత్త పడటం[శిక్షణాపరంగా]:
ఇమాం బఖర్[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: “అప్పుడే పుట్టిన శిసువు అంగిలిలో[గొంతులో] ఫురాత్[ఇరాక్ లో గల ఒక నది పేరు] యొక్క నీటిని పోసి తన చెవిలో అఖామత్ చెప్పటం మంచిది”.
అఖీఖా మరియు నామకరణం:
ఇమాం[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “శిసువు జన్మించిన ఏడవ రోజున ఒక వేళ మగశిసువైతే ఒక మగ గొర్రెను ఆడశిసువైతే ఆడ గొర్రెను బలి ఇచ్చి ఆ మాంసాంలో కొంత భాగాన్ని మంత్రసానికి[ప్రసవపుసమయంలో సహాయం చేసిన స్తీ] ఇవ్వండి మరియు అదే రోజు సిసువుకు నామకరణం చేయండి”.
ఎటువంటి నామం వారి హక్కులో ఉత్తమము:
ఇమాం బాఖిర్[అ.స]ల వారు ఈ విధంగా ప్రవచించారు: "అల్లహ్ దాసుల మరియు వాటి సంభందిత నామములు చాల ఉత్తమమైనవి మరియు అందులోనూ శ్రేష్టమైనవి అల్లాహ్ యొక్క ప్రవక్తల పేర్లు"۔
ధార్మిక బోధనలు చిన్ననాటినుండే చాలా అవసరం:
ఇమాం[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: "ఎప్పుడైతే పిల్లవానికి మూడు సంవత్సరాలు పూర్తవుతాయో వాడికి ఏడు సార్లు "లాఇలాహ ఇల్లల్లాహ్"చెప్పమనండి[గుర్తుపెట్టుకొనుట కొరకు],నాలుగు సంవత్సరములు నిండిన తరువాత ఏడు సార్లు"మొహమ్మదున్ రసూలుల్లాహ్" చెప్పమనండి,ఐదు సంవత్సరములు నిండిన తరువాత ఖిబ్లాను పరిచయం చేసి అదే వైపు సజ్దా చేయమని చెప్పండి,ఆరు సంవత్సరములు పూర్తైన తరువాత రుకూ,సజ్దాలు సరిగా చేసేలా వారికి శిక్షణ ఇవ్వండి,ఏడు సంవత్సరములు నిండిన తరువాత వారితో ముఖము మరియు చేతులు సరిగా కడిగి నమాజు చేయమని చేయుటకు ఆదేసించండి".

రెఫెరెన్స్
వసాయెలుష్ షియా,15వ భాగం, పేజీ నం:128,130, 151, మకారిముల్ అఖ్లాఖ్, పేజీ నం:115.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8