ఉమ్ముల్ బనీన్ వివాహం

శుక్ర, 03/02/2018 - 06:49

.హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణించిన తరువాత, అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉమ్ముల్ బనీన్ తో వివాహం చేసుకోవడానికి కారణం.

ఉమ్ముల్ బనీన్ వివాహం

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణించిన తరువాత, అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] తన సోదరుడు అఖీల్ ను పిలిచి అతనితో తన కోసం వీరుని జన్మనిచ్చేందుకు వీరుల వంశం నుండి ఒక స్ర్రీని వివాహమాడడానికై కోరారు. అఖీల్ ఇబ్నె అబీతాలిబ్, “ఫాతెమా కలాబియహ్”ను ఇమామ్ అలీ[అ.స]తో వివాహం కోసం ఎంచుకున్నారు. ఈమె “బనీ కిలాబ్” సమూహానికి చెందినవారు, ఈ వంశం మరియు సమూహం తమ వీరత్వంలో సాటి లేని వారు. హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కూడా వారి నిర్ణయాన్ని అంగీకరించారు.
ఆ తరువాత ఇమామ్ అలీ[అ.స] అఖీల్ ను ఉమ్ముల్ బనీన్ తండ్రి వద్దకు పంపారు. తండ్రి ఈ వార్తను విని చాలా సంతోషించారు, అతను తన ఆతురతతో కుమార్తే వద్దకు వచ్చి ఆ శభవార్తను చెప్పారు, ఉమ్ముల్ బనీన్ కూడా చాలా గౌరవంగా మరియు ప్రతిష్ఠతగా ఒప్పుకున్నారు. అలా ఆమె వివాహం ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]తో జరిగింది.
ఇమామ్ అలీ[అ.స] అమెలో ఉన్న వివేకాన్ని, దృడమైన విశ్వాసాన్ని, మంచి స్వభావాన్ని, పవిత్రను చూశారు మరియు ఆమెను గౌరవించేవారు మరియు ఆమె ప్రతిష్ఠతను నిరంతరం కాపాడేవారు.[ఉమ్ముల్ బనీన్ బానూయే మర్ద్ ఆఫరీన్, పేజీ50,]         

రిఫ్రెన్స్
ఉమ్ముల్ బనీన్ బానూయే మర్ద్ ఆఫరీన్, పేజీ50, మజల్లాహ్, గుల్ బర్గ్, ముర్దాద్ 1382, షుమారహ్41.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15