మస్జిదు ప్రాముఖ్యత దివ్యఖురాన్ మరియు హదీసులలో

శుక్ర, 03/02/2018 - 18:31

మస్జిదులు ఎవరి సొత్తు కావు, అవి కేవలం అల్లాహ్ మరియు అతని దాసులకు చెందిన పవిత్రమైన ప్రదేశాలు.

మస్జిదు ప్రాముఖ్యత దివ్యఖురాన్ మరియు హదీసులలో !

ఇస్లాంలో మస్జిదులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉన్నది అవి కేవలం ప్రార్ధనా స్థలాలే కాకుండా విశ్వాసులు ఏకమయ్యి తమ సమస్యల గురించి చర్చించుకుని వాటిని పరిష్కరించుకునే చోటు కూడా,మరియు దీని ద్వారానే ఇతర ముస్లిం సోదరులతో కలిసి వారి బాగోగులను తెలుసుకొని ఐక్యమత్యంగా జీవించాలనేదే ఇస్లాం ఉద్దేశం, దైవ ఖురాన్లో అల్లహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
إِنَّمَا يَعْمُرُ مَسَٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْءَاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ
“అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే, అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు” [సూరయే తౌబ/18].
మహాప్రవక్త[స.అ.వ] ఈ విధంగా సెలవిస్తున్నారు: “మస్జిదులు విస్వాసుల యొక్క గృహములు”[అంటే విశ్వాసులు తమ ఎక్కువ సమయాన్నీ మసీదులలో గడుపుతారని అర్ధం].
వేరే చోట మహనీయ ప్రవక్త[స.అ.వ] ఈ విధంగా సెలవిచ్చారు: “ఎవరైతే మస్జిదులను తమ గృహాలుగా చేసుకుంటారో[దైవస్మరణ మరియు ప్రార్ధనలలో గడుపుతారో] అల్లాహ్ [పరలోకపు] సాఫల్యనికి,సుఖశాంతులకు మరియు సిరాత్ వంతెనను దాటుటకు జామినుదారుడు”.
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు; “నాకు స్వర్గంలో కూర్చోవటం కన్నా మస్జిదులో కూర్చోవటం ఇష్టం,ఎందుకంటే స్వర్గంలో కూర్చుంటే నా మనస్సు సంతోషిస్తుంది కానీ మస్జిదులో కూర్చోవటం వలన నా దేవుడు సంతోషిస్తాడు”.
మస్జిదులో నమాజు చదివే వారి ప్రాముఖ్యతను వివరిస్తూ మహనీయ ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఏ ఒక్క రోజూ సమాధి వాసులకు  గడవదు కానీ ప్రతీ రోజూ ఒక దేవదూత ఈ విధంగా వారితో సంభోదిస్తూ ప్రశ్నిస్తాడు:  ప్రతీ రోజూ మీ అసూయ మరియు ఇచ్చ దేని గురించి?వారు ఈ విధంగా జవాబిస్తారు: మా ఇచ్చ మరియు అసూయ ఈ మస్జిదులకు వెళ్ళే వారి గురించి,వారు రోజూ నమాజు,రోజా[ఉపవాసాలను] పాటిస్తారు,మేము పాటించలేము”.
మస్జిదులలో నమాజుల యొక్క పుణ్యన్ని ప్రస్థావిస్తూ మహప్రవక్త ఈ విధంగా ఉల్లేఖించారు: “నా మస్జిదులో [మస్జిదే నబవి] నమాజు వేరే మస్జిదులలో చేసే పదివేల నమాజులతో సమానం మరియు మస్జిదుల్ హరాంలో చేసే నమాజు వేరే మస్జిదులలో చేసే లక్ష నమాజులతో సమానం” .

రెఫరెన్స్
ముస్తద్రకుల్ వసాయెల్,3వ భాగం,పేజీ నం:363,463,సవాబుల్ ఆమాల్,పేజీ నం:74.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7