అనాధలను ఆదరించటం మన కర్తవ్యం!

ఆది, 03/04/2018 - 19:43

అనాధలను ఆదరించి వారిని ఆదుకోవటంతో ఆ అల్లహ్ కృపకు అర్హులవుతాము.

అనాధలను ఆదరించటం మన కర్తవ్యం!

దివ్య ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
لَّيْسَ ٱلْبِرَّ أَن تُوَلُّوا۟ وُجُوهَكُمْ قِبَلَ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَلَٰكِنَّ ٱلْبِرَّ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْءَاخِرِ وَٱلْمَلَٰٓئِكَةِ وَٱلْكِتَٰبِ وَٱلنَّبِيِّۦنَ وَءَاتَى ٱلْمَالَ عَلَىٰ حُبِّهِۦ ذَوِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَٰمَىٰ وَٱلْمَسَٰكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ وَٱلسَّآئِلِينَ وَفِى ٱلرِّقَابِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَٱلْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَٰهَدُوا۟ ۖ وَٱلصَّٰبِرِينَ فِى ٱلْبَأْسَآءِ وَٱلضَّرَّآءِ وَحِينَ ٱلْبَأْسِ ۗ أُو۟لَٰٓئِكَ ٱلَّذِينَ صَدَقُوا۟ ۖ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُتَّقُونَ
“మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు.   సదాచరణ   అంటే   వాస్తవానికి   అల్లాహ్ను,   అంతిమ   దినాన్నీ,   దైవదూతలనూ,   దైవగ్రంథాన్నీ,   దైవ   ప్రవక్తలనూ   విశ్వసించటం.   ధనప్రీతి   ఉన్నప్పటికీ   సమీప   బంధువు   లకు,   అనాధలకు,   అగత్యపరులకు,   బాటసారులకు,   యాచించే   వారికి   (ధనాన్ని)   ఇవ్వటం,   బానిసలకు   విముక్తి   నొసగటం,   నమాజును   నెలకొల్పటం,   జకాతును   చెల్లిస్తూ   ఉండటం,   ఇచ్చిన   మాటను   నిలుపుకోవటం,   లేమిలో   కష్టకాలంలో,   యుద్ధ   సమయా   లలో   సహన   స్థయిర్యాలను   కనబరచటం-   ఇవన్నీ   కలిగి   వున్నవారే   వాస్తవానికి   సత్యమూర్తులు.   భయభక్తులు   కలవారు   కూడా   వీరే” [అల్-బఖర/177].
అనాధల పట్ల నిర్లక్ష్యం తగదు:
అనాధల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని దివ్య ఖురాన్ ఈ విధంగా హెచ్చరిస్తొంది:
أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ
తీర్పు   (దినము)ను   ధిక్కరించే   వాడిని   నీవు   చూశావా!?, వీడే   అనాధను   గెంటివేసేవాడు [అల్-మాఊన్/1,2].
అనాధల సొమ్ము తినే వారి పరిణామం:
అనాధల సొమ్ముతో కడుపు నింపుకునే వారి యొక్క పరిణామలను దైవగ్రంధం ఈ విధంగా ప్రస్థావిస్తుంది:
إِنَّ ٱلَّذِينَ يَأْكُلُونَ أَمْوَٰلَ ٱلْيَتَٰمَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ نَارًۭا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًۭا
“తండ్రిలేని   బిడ్డల   సొమ్మును   అన్యాయంగా   తినేవారు   తమ   పొట్టల్ని   అగ్నితో   నింపుకుంటున్నారు.   త్వరలోనే   వారు   మండే   అగ్నిలోకి   ప్రవేశిస్తారు”.[అన్-నిసా/10].
స్వర్గంలో మహనీయ ప్రవక్తతో:
దైవ ప్రవక్త ఈ విధంగా ఉల్లేఖించారు:
"من كفَّل يتيماً و نفقته كنت أنا و هو في الجنَّة كهاتين و قرن بين اصبعيه المسبّحة و الوسطي"
అనువాదం: ఎవరైతే అనాధలను పోషించి వారి అవసరాలను తీరుస్తారో నేను మరియు ఆ అనాధ పోషకుడు స్వర్గంలో ఇలా ఉంటాం,"అప్పుడాయన తన చూపుడు వ్రేలిని మరియు మద్య వ్రేలిని కలిపి ఉంచి చూపించారు"[అంటే స్వర్గంలో ఇద్దరం ఒకే చోట ఉంటాము అని అర్ధం].
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు:
"ما من مؤمن و لا مؤمنة يضع يده علي رأس يتيمٍ ترحّماً الّا كتب الله له بكلّ شعرة مرَّت يده عليها حسنة"
అనువాదం: “మీలోని విశ్వాస పురుషులు మరియు స్త్రీలలో ఎవరైతే ప్రేమతో అనాధ బాలుని యొక్క తల నిమురుతారో ఆ బాలుని తలలోని ప్రతీ వెంట్రుకకు బదులుగా ఒక్కో పుణ్యం రాయబడుతుంది”.

రెఫరెన్స్
ఖుర్బుల్ అస్నాద్,పేజీ నం:45,సవాబుల్ ఆమాల్,పేజీ నం:237.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 82