తహ్రీమ్ సూరహ్

బుధ, 03/07/2018 - 18:06

అల్లాహ్ యొక్క పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 66వ సూరహ్ అయిన “తహ్రీమ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

తహ్రీమ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 66వ సూరహ్ ఇది. “తహ్రీమ్” అనగ హరామ్ గా నిర్ధారించడం, నిషేధించడం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “తహ్రీమ్” అను పదం 1 సారిమరియు పూర్తి ఖుర్ఆన్ లో 83 సార్లు(హర్రమ, తుహర్రిము, మహ్రూమ్, ముహర్రమ్, ముహర్రమహ్ అని పలు విధాలుగా) వచ్చింది. ఈ సూరహ్ లో 12 ఆయత్‍లు, 254 పదాలు మరియు 1105 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 13 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “హుజురాత్” సూరహ్ మరియు దీని తరువాత “తగాబున్” సూరహ్ అవతరించబడ్డాయి. “తహ్రీమ్” సూరహ్ ను “లిమ తుహర్రిమ్”, “ముతహర్రిమ్” అని కూడా అంటారు. “తహ్రీమ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “తుహర్రిమ్” అని ఉండడం, ఇది “తహ్రీమ్” పదం నుండి వచ్చినదే. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “తహ్రీమ్” సూరహ్ ను పఠిస్తారో అల్లాహ్ వారికి “తౌబయే నసూహ్”(తిరిగి పాపములు చేయనివ్వనటువంటి క్షమాపణం) ప్రసాదిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ52].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ52.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13