ముల్క్ సూరహ్

బుధ, 03/07/2018 - 18:14

పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 67వ సూరహ్ అయిన ముల్క్ సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ముల్క్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 67వ సూరహ్ ఇది. “ముల్క్” అనగ యాజమాన్యం, అధికారం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ముల్క్” అను పదం 1 సారిమరియు పూర్తి ఖుర్ఆన్ లో 42 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 30 ఆయత్‍లు, 333 పదాలు మరియు 1350 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “తూర్” సూరహ్ మరియు దీని తరువాత “హాఖ్ఖహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ముల్క్” సూరహ్ ను “తబారక్”, “మానెఅహ్”, “వాఖెయహ్”, “ముంజియహ్” మరియు “మన్నాఅహ్” అని కూడా అంటారు. “ముల్క్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “ముల్క్” అని ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ముల్క్” సూరహ్ ను పడుకునే పఠిస్తారో అతను ఉదయం వరకు అల్లాహ్ రక్షణలో ఉంటాడు. మరి అలాగే ప్రళయం నాడు కూడా రక్షణలో ఉంటాడు చివరికి స్వర్గంలో ప్రవేశిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ67].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ67.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23