రమజాన్ పండుగదిన ప్రార్ధనా విధానాలు

శుక్ర, 04/14/2017 - 06:18
రమజాన్ పండుగదిన ప్రార్ధనా విధానాలు

రమజాన్, పవిత్ర మాసం, అల్లాహ్ అదేశం ప్రకారం ముస్లిములందరూ రమజాన్ మాసంలో ఉపవాస దీక్షను నిర్వహిస్తారు. రోజంతా పచ్చిమంచి నీరు కూడా ముట్టు కోరు. అలా ఆ నెలంతా ఉపవాస దీక్ష నిర్వహించిన ముస్లిములందరూ షవ్వాల్ నెల మొదటి రోజున రమజాన్ పండుగ చేసుకుంటారు. మరి ఆరోజున కొన్ని ప్రత్యేక ప్రార్ధనలు ఉన్నాయి. అవి:
1. ఫజర్ నమాజ్ మరియు ఈద్ నమాజ్ తరువాత ఇలా పఠించాలి: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్, అల్ హందు లిల్లాహ్ అలా మా హదానా, వ లహుష్షుక్రు అలా మా ఔలానా ”.
2. ఈద్ నమాజ్ కన్న ముందే “జకాతె ఫిత్రా” చెల్లించాలి.
3. ఇలా చెప్పి స్నానం చేయాలి:  “గుస్లె ఈదుల్ ఫిత్ర్ కర్తా హు/కర్తీ హూఁ ఖుర్బతన్ ఇలల్ ల్లాహ్ ”(ఈదుల్ ఫిత్ర్ యొక్క గుస్ల్ చేస్తున్నాను అల్లాహ్ సామీప్యం కోసం).
4. ఈద్ నమాజ్ కు ముందే ఎదైనా తినడం.
5. రెండు రక్అత్ నమాజ్ ఈ ఉద్దేశంతో చదవాలి “దో రక్అత్ నమాజే ఈదుల్ ఫిత్ర్ పఢ్తా/పఢ్తీ హూఁ ఖుర్బతన్ ఇలల్లాహ్”(రెండు రక్అత్ నమాజ్ చదువుతున్నాను అల్లాహ్ సామీప్యం పొందెందుకు).[మఫాతీహుల్ జినాన్, రమజాన్ ప్రార్ధనా విధానాల భాగంలో]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ ప్రార్ధనా విధానాల భాగం నుండి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14