. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్[స.అ] జననం మరియు వారి పోషణభాధ్యుల గురించి సంక్షిప్తంగా.
![దైవప్రవక్త[స.అ] జననం](https://te.btid.org/sites/default/files/field/image/1_prophetflower.jpg)
దైవప్రవక్త ముహమ్మద్(స.అ) 17, రబీవుల్ అవ్వల్, శుక్రవారం, “ఆముల్ ఫీల్”, క్రి.శ 570 మక్కాలో జన్మించారు.
దైవప్రవక్త ముహమ్మద్(స.అ) యొక్క తండ్రి పేరు జనాబె అబ్దుల్లాహ్ ఇబ్నే అబ్దుల్ ముతల్లిబ్(అ.స), తల్లి పేరు ఆమిన బింతె వహబ్(అ.స).
ప్రవక్త బిరుదులు: “రసూలుల్లాహ్, నబీయుల్లాహ్, నూర్, ముస్తఫ, మహ్‌మూద్, అమీన్, సాదిఖ్, వుమ్మి, ఖాతమ్, నజీర్, ముజమ్మిల్, ముదబ్బిర్, బషీర్, ముబీన్, కరీమ్, నేమత్, రహ్మత్, షాహిద్, ముబష్షిర్, యాసీన్, తాహా మొ...,
వీరు జన్మించక ముందే వీరి తండ్రి మరణించారు, అందు వలన వారి పాలన బాధ్యత వారి తాతయ్య అబ్దుల్ ముతల్లిబ్(అ.స) చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత అబ్దుల్ ముతల్లిబ్(అ.స) మరణాంతరం, హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క బాబాయి అబూతాలిబ్(అ.స) వీరి యొక్క పాలన బాధ్యత తీసుకున్నారు.
దైవప్రవక్త ముహమ్మద్(స.అ) వివాహము జనాబె ఖదీజతుల్ కుబ్రా బింతె ఖువైలద్(అ.స) అను యువతితో జరిగింది. హజ్రత్ ముహమ్మద్(స.అ), ప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత ఆడ వారిలో మొట్ట మొదట వారి పై ఈమాన్ తెచ్చిన స్త్రీ జనాబె ఖదీజా(స.అ). [ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో]
రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya.. Jazakallah.
వ్యాఖ్యానించండి