ఖలమ్ సూరహ్

గురు, 03/08/2018 - 12:10

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 68వ సూరహ్ అయిన “ఖలమ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖలమ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 68వ సూరహ్ ఇది. “ఖలమ్” అనగ కలము. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఖలమ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 4 సార్లు(2 సార్లు ఏకవచనంగా మరియు 2 సార్లు బహువచనంగా) వచ్చింది. ఈ సూరహ్ లో 52 ఆయత్‍లు, 301 పదాలు మరియు 1288 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అలఖ్” సూరహ్ మరియు దీని తరువాత “ముజ్జమ్మిల్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఖలమ్” సూరహ్ ను “నూన్” మరియు “వల్ ఖలమ్” అని కూడా అంటారు. “ఖలమ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “ఖలమ్” అని ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ఖలమ్” సూరహ్ ను తన వాజిబ్ లేదా ముస్తహబ్ నమాజులలో పఠిస్తారో అల్లాహ్ అన్ని రకాల బీదతనం నుండి అతనికి రక్షణ ఇస్తాడు మరియు మరణించిన తరువాత సమాధి చీకటి నుండి రక్షింపబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ82].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ82.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11