పవిత్ర ఇస్లాం దృష్టిలో స్త్రీ యొక్క స్థానం కూడా పవిత్రమైనదే. ఇస్లాం స్త్రీను మనిషిగా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇస్లాం రాక మునుపు, స్ర్తీ చాలా దురస్థితిలో గడిపేది. స్త్రీలకు ఎటువంటి హక్కులు లేవు మరియు వాళ్ళు మనిషులే కారని భావించే నేల పై, ఇస్లాం కాంతి ప్రకాశించింది మరియు స్త్రీని అజ్ఞానపు ఆలోచనల ద్వార పట్టిన దురస్థితి నుండి దూరం చేసింది. మరియు వాళ్ళ స్థానాన్ని, హక్కులను మరియు స్థాయిని ప్రత్యేకంగా వివరించి వారి ప్రతిష్టతను పెంచింది. వారిని జీవసమాధి చేసే స్థితి నుండి తీసి మనిషికి జన్మనిచ్చే విషయంలో ప్రధాన పాత్ర స్త్రీదే అన్న విషయాన్ని తెలియపరిచింది; అన్న విషయాలు యదార్థం.
అజ్ఞానపు చీకటి ఆకాశం పై ఇస్లాం ప్రకాశించి స్త్రీకు గౌరవాన్ని ప్రసాదించింది. ఆడబిడ్డను శుభం మరియు మంగళం అని అంది. స్ర్రీలను రైహానహ్(తులసి వంటిది)గా పరిచయం చేసింది. స్త్రీల హక్కులను మరియు వాళ్ళ ప్రాధాన్యతను వివరిస్తూ ఎన్నో ఆయత్ లు మరియు హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి. కాని కొందరు తప్పుడు వ్యాజ్యములతో స్ర్తీలను ఇస్లాం వారికి ఇచ్చిన గౌరవం మరియు స్థానం నుండి క్రిందికి తీసుకొచ్చారు. వీలు దొరికితే తప్పకుండా ఇస్లాంలో స్త్రీల ప్రాముఖ్యత గురించి తెలుకొనే ప్రయత్నం చేయండి. తప్పుడు మాటలు లేదా తప్పుడు నిదర్శనలను విని పరిశోధించకుండానే నిర్ణయం తీసుకోకండి.
వ్యాఖ్యానించండి