చెడు సాహచర్యం యొక్క ప్రభావం

ఆది, 03/18/2018 - 15:48

చెడు సాహచర్యం ఎప్పటికైనా ప్రమాదకరమే!

చెడు సాహచర్యం యొక్క ప్రభావం

ఒక తండ్రి తన కొడుకును పొషణ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుని పెంచేవాడు,ఆ కొడుకు నవయవ్వనానికి సమీపించిన సమయంలో వాడికి కొంత మంది చెడు అలవాట్లు గల వారితో స్నేహం కుదిరింది,అది చూసిన తండ్రి ఆ కొడుకు విషయంలో చాల దిగులు పడశాగాడు,ఎలగైన తన కొడుకుని వాళ్ళ సాహచర్యం నుంచి దూరం చేసి మంచి దారి వైపు మళ్ళించాలని నిర్ణయించుకున్నాడు.
ఒక రోజు కొన్ని పళ్ళను ఒక డబ్బాలో పెట్టి వాటిని ఇంటికి తీసుకు వచ్చాడు,వాటిలో ఒక చెడి పోయిన పండు కూడా ఉన్నది,దానిని చూసిన ఆ కొడుకు వాటిలోంచి ఆ చెడిపోయిన పండును తీయబోతే తండ్రి తీయవద్దని చెప్పి వాటిని ఒక చోట భద్రపరిచాడు,మరుసటి రోజు తన కొడుకును పిలిచి ఆ డబ్బా విప్పి చూపించాడు,దానిలొ ఉన్న ఆ ఒక్క చెడిపోయిన పండు వలన మిగిలిన అన్ని పండ్లు కూడా పాడయిపోయాయి,అప్పుడు తండ్రి తన కొడుకుతో ఈ విధంగా చెప్పాడు:చూసావా! ఒక చెడిపోయిన పండు మిగిలిన అన్ని పండ్లపై తన ప్రభావాన్ని చూపి వాటిని చెడిపోయేలా చేసింది,అలాగే పదిమందిలో ఒక చెడు స్నేహితుడు ఉన్న చాలు మొత్తం ఆ పది మందిని చెడిపోయేలా చేయటానికి.
తండ్రి చెప్పిన మాటలు విన్న ఆ కొడుకు తన తప్పును తెలుసుకొని తండ్రితో క్షమాపన కోరి చెడు సాహచర్యన్ని వదిలి మంచి దారిని ఎంచుకొంటానని ప్రమాణం చేసాడు.
మహాప్రవక్త[స.అ.వ] ఈ విధంగా సెలవిచ్చారు:
إخوانُ السَّوءِ كَشَجَرَةِ النّارِ یُحرِقُ بَعضُها بَعضاً
"చెడు సాహచర్యుల యొక్క ఉపకారం అగ్నిలో కాలుతున్న చెట్ల వంటిది,ఆ చెట్ల లోని కాలుతున్న కొమ్మలు తమ పక్కనే ఉన్న వేరే కొమ్మలను కాల్చేస్తాయి" [అలాగే చెడు స్నేహితుడు తన చెడు సాహచర్యపు అగ్నిలో మిగిలిన స్నేహితుల వ్యక్తిత్వాన్ని మాడి మసయిపోయేలా చేస్తాడు].
మహనీయ ప్రవక్త[స.అ.వ] ఆ అల్లహ్ తో ఈ విధంగా ప్రార్దిస్తున్నారు:
اللّهُمَّ إنّی أعوذُ بِكَ مِن صاحِبِ غَفلَةٍ، وقَرینِ سَوءٍ
అనువాదం:"ఓ ప్రభువా! నేను నిర్లక్ష్యపు స్నేహితుల నుండి మరియు చెడు సాహచర్యుల నుండి నీ శరణుకోరుతున్నాను". 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8