ఇతరులపై నిందారోపణ మహా పాపం

ఆది, 03/18/2018 - 19:41

ఇతర అమాయక ప్రజలపై నిందలు వేయడం మహా పాపం,అలా చేసే వారు దానికి ఫలితంగా ఆ అలాహ్ యొక్క ఆగ్రహాన్ని కూడబెట్టుకున్నవారవుతారు. 

ఇతరులపై నిందారోపణ మహా పాపం

ఇస్లాంలో ఇతరులపై నిందారోపణ అనేది మహాపాపంగా పరిగణించబడినది ఎందుకంటే ఇతరులపై నిందలు మోపడం అనేది ఒక సమాజంలోనే క్షమించరాని పాపం అలాంటిది ఆ అల్లాహ్ ద్రుష్టిలో ఎలా పాపము కాదు? అది మహా పాపము ఆ పనికి తీవ్రమైన శిక్షను అనుభవించక తప్పదు.
అల్లాహ్ దీని గురించి పవిత్ర ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَمَن يَكْسِبْ خَطِيٓـَٔةً أَوْ إِثْمًۭا ثُمَّ يَرْمِ بِهِۦ بَرِيٓـًۭٔا فَقَدِ ٱحْتَمَلَ بُهْتَٰنًۭا وَإِثْمًۭا مُّبِينًۭا
“ఇంకా ఎవరయినా ఏదైనా తప్పు చేసి, లేదా పాపానికి పాల్పడి, ఆ నిందను ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే, అలాంటివాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు”[అన్-నిసా/112].
ఏ పాపం ఎరుగని అమాయకులపై అభాండాలు వెయటము సబబు కాదని అది కూడ పాపమేనని ఖురాన్ వ్యాఖ్యానిస్తుంది:
وَٱلَّذِينَ يُؤْذُونَ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ بِغَيْرِ مَا ٱكْتَسَبُوا۟ فَقَدِ ٱحْتَمَلُوا۟ بُهْتَٰنًۭا وَإِثْمًۭا مُّبِينًۭا
తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని, స్పష్టమైన పాపభారాన్ని మోసినవారవుతారు[అల్-అహ్జాబ్/58].
ఏ పాపము ఎరుగని అమాయక స్త్రీలపై నిందలు మోపడం మానుకోమని ఒక వేళ అలా చేస్తే తీవ్రమైన శిక్షను అనుభవించక తప్పదని దివ్య ఖురాన్ హెచ్చరిస్తుంది:
إِنَّ ٱلَّذِينَ يَرْمُونَ ٱلْمُحْصَنَٰتِ ٱلْغَٰفِلَٰتِ ٱلْمُؤْمِنَٰتِ لُعِنُوا۟ فِى ٱلدُّنْيَا وَٱلْءَاخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌۭ٭یوْمَ تَشْهَدُ عَلَيْهِمْ أَلْسِنَتُهُمْ وَأَيْدِيهِمْ وَأَرْجُلُهُم بِمَا كَانُوا۟ يَعْمَلُونَ
“సౌశీల్యవతులుగా ఉన్న, ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు,వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది, ఆ రోజు వారి నోళ్లూ, వారి కాళ్లూ చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి” [అన్-నూర్/23,24].
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు:
الْبُهْتَانُ عَلَى الْبَرِیِّ أَثْقَلُ مِنَ الْجِبَالِ الرَّاسِیَاتِ
అనువాదం:"ఏ పాపము ఎరుగని అమాయకులపై నిందలు వేసే పాపం యొక్క భారం నిటారుగా స్థిరంగా నిలబడి ఉన్న పర్వతాల కంటే ఎక్కువ"[అంటే ఎటువంటి భూకంపాలనైనా ధాటిగా ఎదురుకునే శక్తి గల పర్వతాలు ఈ పాపం యొక్క భారాన్ని మాత్రం మోయలేవని అర్ధం].
ఇమాం జైనుల్ ఆబిదీన్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
مَنْ رَمَى النَّاسَ بِمَا فِیهِمْ رَمَوْهُ بِمَا لَیْسَ فِیهِ
అనువాదం: “ఎవరైతే ఇతరుల యొక్క లేని దోషాలను చూపిస్తూ వారిపై నిందలు వేస్తారో వారిపై కూడా ప్రజలు లేని నిందలను వేస్తారు” [వారు కూడా తమపై వచ్చే లేని పోని నిందలనుంచి తప్పించుకోలేరు].

రెఫరెన్స్
అల్-ఖిసాల్, 2వ భాగం, పేజీ నం:5, బిహారుల్ అన్వార్, 17వ భాగం, పేజీ నం:160.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16