రజబ్ మాసం సందర్భాలు

సోమ, 03/19/2018 - 16:33

ఇస్లామీయ చరిత్ర ప్రకారం రజబ్ మాసంలో జరిగిన సంఘటనల గురించి సంక్షిప్త వివరణ.

రజబ్ మాసం సందర్భాలు

1వ తారీఖు: హిజ్రీ యొక్క 57వ సంవత్సరం మదీనహ్ లో హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] జన్మించారు. 2వ తారీఖు(లేదా 5వ తారీఖు): ఒక రివాయత్ ప్రకారం హిజ్రీ యొక్క 212వ లేదా 214వ సంవత్సరం మదీనహ్ సమీపంలో ఉన్న “బసరియా” అనబడే ఒక గ్రామంలో హజ్రత్ ఇమామ్ అలీయున్నఖీ[అ.స] జన్మించారు.
3వ తారీఖు: కొన్ని రివాయతుల ప్రకారం హిజ్రీ యొక్క 254వ సంవత్సరం “సామరా”లో హజ్రత్ ఇమామ్ అలీయున్నఖీ[అ.స] మరణించారు.
10వ తారీఖు: హిజ్రీ యొక్క 195వ సంవత్సరం శుక్రవారం రోజున హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] జన్మించారు.
13వ తారీఖు: హిజ్రత్ కన్న 33 సంవత్సరాల క్రితం అల్లాహ్ గృహం అనగ కాబాలో హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] జన్మించారు.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 63వ సంవత్సరంలో జనాబె జైనబ్ బింతె అలీ[అ.స] మరణించారు.
25వ తారీఖు: హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ మూసా కాజిమ్[అ.స] కారాగారంలో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం చంపబడ్డారు.
27వ తారీఖు: ఈ రోజు హజ్రత్ ముహమ్మద్[స.అ] దైవప్రవక్తగా ఎన్నుకోబడిన రోజు. అల్లాహ్ తరపు నుండి దైవవాణి అవతరించబడింది. ఈ రోజు అతి మహోన్నతమైన పండగ దీనముల నుండి ఒకటి.[ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.]
28వ తారీఖు: హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ[అ.స] మదీనహ్ నుండి తన కుటుంబ సభ్యులతో ప్రయాణం మొదలు పెట్టారు. ఆ తరువాత వారు కర్బలాలో అతి దారుణంగా హతమార్చబడ్డారు.

రిఫ్రెన్స్
హౌజా నెట్. ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

సలామున్ అలైకుం. మీరు కామెంట్ చేసినందుకు చాలా సంతోషించాము. ఇలాగే మీరు మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ ఉంటారని భావిస్తున్నాము. మీ కోరిక ప్రకారంగానే ఈ మాసంలో ప్రతీ సందర్భం గురించి తప్పకుండా వేరు వేరుగా వ్యాసాలు మీ ముందుకు తీసుకొని వస్తాము. ధన్యావాదాలు.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21