లైలతుర్రగాయిబ్ యొక్క ఆమాల్

బుధ, 03/21/2018 - 17:24

రజబ్ మాసంలో ప్రత్యేక రాత్రులలో ఒకటి “లైలతుర్రగాయిబ్” ఆ రాత్రి చేయవలసిన కొన్ని ప్రార్ధనల సంక్షిప్త వివరణ.

లైలతుర్రగాయిబ్ యొక్క ఆమాల్

రజబ్ మాసంలో ప్రత్యేక రాత్రులలో ఒకటి “లైలతుర్రగాయిబ్”. అనగా రజబ్ మాసం యొక్క మొదటి గురువారం రాత్రి. ఈ రాత్రిని “లైలతుర్రగాయిబ్” అని అంటారు. ఆ రాత్రి నిర్వర్తించేందుకు ప్రత్యేక ప్రార్ధనలు ఉల్లేఖించబడి ఉన్నాయి. అవి:
1. ఉపవాసం: గురువారం రోజంతా ఉపవాసం ఉండాలి.
2. నమజ్: రాత్రి అయిన తరువాత మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజుల మధ్య 12 రక్అత్ల నమాజ్ చదవాలి. ప్రతీ రెండు రక్అత్లలను ఒక సలామ్ ద్వార పూర్తి చేయాలి. నమాజ్ చదివే పద్ధతి: ప్రతీ రక్అత్ లో 1సారి “అల్ హంద్” సూరహ్, 3 సార్లు “ఖద్ర్ సూరహ్”(ఇన్నా అన్జల్నా) మరియ 12 సార్లు “ఇఖ్లాస్ సూరహ్”(ఖుల్ హు వల్లాహ్) చదవాలి. 12 రక్ఆత్ లు పూర్తైన తరువాత 70 సార్లు “అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మదిన్నబీయ్యిల్ ఉమ్మీ వ అలా అలిహీ” అని చెప్పాలి. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు “సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్” అని చెప్పాలి. సజ్దా నుండి తలను ఎత్తిన తరువాత కూర్చోని 70 సార్లు “రబ్బిగ్ఫిర్ వర్హమ్ వ తజావజ్ అమ్మా తఅలమ్, ఇన్నక అంతల్ అలీయ్యుల్ అజీమ్” అని చెప్పాలి. ఆ తరువాత మరలా సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు “సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్” అని చెప్పాలి. అప్పుడు మీరు అల్లాహ్ తో మీకు కావలసినది కోరుకో వచ్చు. ఇన్షా అల్లాహ్ అవి జరిగి తీరుతాయి.[మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం యొక్క ఆమాల్ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
షెఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం యొక్క ఆమాల్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Aap ka bhi bahot bahot shukriya site par aane ka.....

Submitted by zaheer on

سایت پر آنے کا بہت بہت شکریہ

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15