ముజ్జమ్మిల్ సూరహ్

శని, 03/24/2018 - 09:52

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 73వ సూరహ్ అయిన “ముజ్జమ్మిల్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ముజ్జమ్మిల్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 73వ సూరహ్ ఇది. “ముజ్జమ్మిల్” ఈ పదం “ౙమల్” పదం నుండి తీసుకోబడినది, అనగా దుప్పటి కప్పుకున్నవాడు. ఇది దైవప్రవక్త[స.అ] యొక్క బిరుదు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి రెండు ఆయత్ లు. ఈ సూరహ్ లో “ముజ్జమ్మిల్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా 1 సారే వచ్చింది. ఈ సూరహ్ లో 20 ఆయత్‍లు, 200 పదాలు మరియు 853 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 7 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఖలమ్” సూరహ్ మరియు దీని తరువాత “మద్దస్సిర్” సూరహ్ అవతరించబడ్డాయి. “ముజ్జమ్మిల్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “ముజ్జమ్మిల్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ముజ్జమ్మిల్” సూరహ్ ను ఇషాఁ నమాజ్ లో లేదా రాత్రి చివరి గడియాలలో పఠిస్తారో మరియు రాత్రింబవళ్ళు “ముజ్జమ్మిల్” సూరహ్ తో ఉంటారో అల్లాహ్ అతనికి “హయాతె తయ్యబహ్”(పవిత్రమైన జీవితం) ను ప్రసాదిస్తాడు అలాగే పవిత్ర మరణాన్ని కూడా ప్రసాదిస్తాడు.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ157].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ157.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18