అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 75వ సూరహ్ అయిన “ఖియామత్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.
ఖుర్ఆన్ యొక్క 75వ సూరహ్ ఇది. “ఖియామత్” అనగ ప్రళయం, అంతిమదినం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఖియామత్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 70 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 40 ఆయత్‍లు, 165 పదాలు మరియు 676 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఖారిఅహ్” సూరహ్ మరియు దీని తరువాత “హుమౙహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఖియామత్” సూరహ్ ను “లా ఉఖ్సిము” అని కూడా అంటారు. “ఖియామత్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ లో ప్రళయదినం యొక్క స్థితిగతుల ప్రస్తావనం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు “ఎవరైతే “ఖియామత్” సూరహ్ ను పఠిస్తారో అతని కోసం నేను మరియు జిబ్రయీల్ ఇద్దరూ సాక్ష్యమిస్తాము, ప్రళయం నాడు కూడా అతను విశ్వాసి అయి ఉంటాడు మరియు అతని ముఖం సృష్టితాలందరి కన్న ఎక్కువగా మెరిసిపోతూ ఉంటుంది.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ190].
రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ190.
వ్యాఖ్యానించండి