జుల్ కిఫ్ల్ పేరెేమిటి మరియు అతను ప్రవక్తేనా అన్న విషయాల గురించి ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] ఇచ్చిన వివరణ.
మర్హూమ్ షేఖ్ సదూఖ్[ర.అ], హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] ద్వార ఇలా ఉల్లేఖించారు: “నేను ఇమామ్ జవాద్(హజ్రత్ ముహమ్మద్ తఖీ[అ.స])కు ఉత్తరం వ్రాసి “జుల్ కిఫ్ల్” పేరేమిటి? మరియు అతను ప్రవక్తేనా? అని ప్రశ్నించాను. అప్పుడు ఇమామ్[అ.స] దానికి జవాబులో ఇలా వ్రాశారు: “అల్లాహ్ అజ్జవల్ల్ 1 లక్షా 24 వేల ప్రవక్తలను పంపాడు అందులో 313 రసూల్ గా అవతరించబడ్డారు “జుల్ కిఫ్ల్” అందులో ఒకరు, అతను “సులైమాన్ ఇబ్నె దావూద్”[అ.స] తరువాత ప్రజలలో హజ్రత్ “దావూద్”[అ.స] వలే తీర్పు ఇచ్చేవారు, అల్లాహ్ కు సంబంధించిన విషయంలో తప్ప మరే విషయంలో కోపం పడేవారు కాదు. అతని పైరు “ఉవైదియా” అల్లాహ్ తన పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఇతని గురించి ప్రస్తావిచాడు: “ وَ اذْکُرْ إِسمَعِیلَ وَ الْیَسعَ وَ ذَا الْکِفْلِ وَ کلٌّ مِّنَ الأَخْیَارِ ఇస్మాయీల్, యస్అ, జుల్ కిఫ్ల్ లను గురించి ప్రస్తావించు; వారందరూ పుణ్యపురుషులలోని వారు”[సాద్ సూరహ్:48].[అల్ మీజాన్, భాగం17, పేజీ329].
రిఫ్రెన్స్
ముహమ్మద్ హుసైన్ తబాతబాయి, అల్ మీజాన్, సాద్ సూరహ్ యొక్క 48 ఆయత్ వివరణలో.
వ్యాఖ్యలు
خيلى خوب
عالى
Shukriya..
Mashallah..
Shukriya aap ka k aap site par aakar msg k zariye hamari himmat afzaei ki.
వ్యాఖ్యానించండి