మామూన్ తో ఇమాం మొహమ్మద్ తఖి[అ.స] సంభాషణ

బుధ, 03/28/2018 - 13:35

ముస్లిముల ఖలీఫా అయినటువంటి మమూన్ రషీద్ తో ఇమాం మొహమ్మద్ తఖి[అ.స]ల వారి సంభాషణ.

మామూన్ తో ఇమాం మొహమ్మద్ తఖి[అ.స] సంభాషణ

ఇమాం మొహమ్మద్ తఖి[అ.స] ఎవరి ముందైనా ధైర్యంగా, న్యాయంగా, నిజాయితీగా మాట్లాడే శక్తిసామర్ద్యాలను తన పితామహులైనటువంటి ఇమాం అలి[అ.స]ల వారి నుండి వారసత్వంగా పొందారు.
ఒకరోజు మామూన్ రషీద్ ఒక మార్గం ద్వారా వెళుతుండగా అక్కడ ఆడుకుంటున్న కొంత మంది పిల్లలు భయపడి తనకు దారి ఇచ్చారు, కానీ ఒక పిల్లవాడు తాను ఉన్నచోటే అలా నిలబడి ఉన్నాడు అది చూసిన మామూన్ కు ఆశ్చర్యం కలిగి ఆ పిల్లవానితో ఈ విధంగా ప్రశ్నించాడు: నువ్వు కూడా ఇతర పిల్లల మాదిరిగా ఎందుకు భయపడి వెళ్ళిపోలేదు? దానికి జవాబుగా ఆ పిల్లవాడు ఈ విధంగా అన్నాడు: “నేను ఏ పాపమూ చేయలేదు ఆ పాపము యొక్క శిక్షకు భయపడి పారిపోవటానికి మరియూ ఖలీఫా[మమూన్ రషీద్] వెళ్ళడానికి దారి కూడా ఇరుకుగా కూడా ఏమియూ లేదు, నేను ప్రక్కకు వెళ్ళి నీకు దారి కల్పించటానికి, నీవు ఎక్కడ నుండి వెళ్ళాలని అనుకుంటావో అక్కడ నుండి వెళ్ళు”.
ఆ పిల్లవాని మాటలూ, ధైర్యంపై మామూన్ ఆశ్చర్య పోయి నీవు ఎవరు? అని ప్రశ్నించాడు, దానికి ఆ పిల్లవాడు, "నేను మొహమ్మద్ బిన్ అలి బిన్ మూసా బిన్ జాఫర్ బిన్ మొహమ్మద్ బిన్ అలి బిన్ హుసైన్ బిన్ అలి బిన్ అబీతాలిబ్[అ.స]" అని అన్నాడు. తిరిగి మామూన్ "నీకు విజ్ఞానం మరియు శాస్త్రాల ఏ మాత్రం జ్ఞానం ఉన్నది?" అని ప్రశ్నించాడు, దానికి జవాబుగా ఆ పిల్లవాడు "పరలోక శాస్త్రాలు మరియు ఆకాశపు నివేదికల గురించి నన్ను అడుగు" అని అన్నాడు, అది విన్న మామూన్ ఆ పిల్లవాని పై అతని మాటలపై ఆశ్చర్యపరుడై వెళ్ళిపోయాడు.

రెఫరెన్స్
ముంతహల్ ఆమాల్, 2వ భాగం, పేజీ నం:327.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meraj on

جزاک اللہ بہت عمدہ ہے

اچھی تحریر اور تحقیق ہے

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8