కూఫా నగరం దాని ప్రాముఖ్యత

సోమ, 04/02/2018 - 09:57

కూఫా నగరంలో గల మస్జిదే కూఫా  ప్రపంచంలో గల నాలుగు ప్రధాన మస్జిదులలో ఒకటి,ఈ మస్జిదులో చేసే ఒక్క నమాజు వేరే మస్జిదులలో చేసే వెయ్యి నమజులతో సమానం.

కూఫా నగరం దాని ప్రాముఖ్యత

మస్జిదె కూఫా యొక్క ప్రాముఖ్యతను దివ్య ఖురాన్ లో ఎన్నొ చోట్ల ప్రస్థావించడం జరిగింది,ముఖ్యంగా సూరయే తీన్ యొక్క మొదటి మూడు ఆయతులలో చూసినట్లైతే:
وَٱلتِّينِ وَٱلزَّيْتُونِ٭ وَطُورِ سِينِينَ٭ وَهَٰذَا ٱلْبَلَدِ ٱلْأَمِينِ
ఈ ఆయతులో “తీన్” అనగా పవిత్ర మదీన నగరమని, “జైతూన్” అనగా బైతుల్ మఖ్దస్ నగరమని, “తూరె సీనీన్” అనగ కూఫా నగరమని, “బలదుల్ అమీన్” అనగ పవిత్ర మక్కా నగరమని  వివరించటం జరిగింది.
ఇమాం అలి[అ.స] తను ఖలీఫాగ ఉన్న సమయంలో ఈ నగరం కెంద్రంగా ఉండేది,అదే కాకుండా ఈ నగరానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి,అల్లాహ్ ప్రవక్తలలో అబుల్ బషర్ హజ్రత్ ఆదం[అ.స]ల వారు,హజ్రత్ నూహ్[అ.స]ల వారు మరియు మరెంతో మంది ప్రవక్తలు,ఉత్తరాధికారులు ఈ మస్జిదుని తమ ప్రార్ధనా స్థలంగా చేసుకొన్న వారే.
కూఫా నగర ప్రాముఖ్యతను వివరిస్తూ ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “కూఫా నగరం మా నగరం,మా షియాల యొక్క పట్టణం మరియు వారి యొక్క ప్రధాన కేంద్రం”.
మహాప్రవక్త[స.అ.వ] మరియు వారి ఉత్తరాధికారుల ప్రవచనాల అనుసారంగా ఈ నగరం స్వర్గపు వనాలలో నుండి ఒక వనం,మరియు ఈ నగరంలో హజ్రత్ నూహ్[అ.స],హజ్రత్ ఇబ్రాహీం[అ.స] మొదలుకుని మూడువందల డబ్బై ప్రవక్తలు ఇచట సమాధియై ఉన్నారు.
హదీసుల అనుసారంగా ప్రపంచంలో గల నాలుగు ప్రముఖ మసీదులలో[మస్జిదె హరాం,మస్జిదె నబవి,బైతుల్ మఖ్దస్,మస్జిదె కూఫ]ఇది నాలుగవది,మరియు ఇమాం సాదిఖ్[అ.స]ల ప్రవచనానుసారం చివరి ఉత్తరాధికారి అయినటువంటి ఇమాం మహ్ది[అ.స]ల వారి రాజ్యాధికారానికి కూడా ఈ కూఫా నగరమే కెంద్రం అని చెప్పవచ్చు.

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్,అల్లామా మజ్లిసి,100వ భాగం,పేజీ:394,405,కితాబుల్ మజార్ బె నఖ్ల్ అజ్ ఖిసాల్,పేజీ:153,సవాబుల్ ఆమాల్,పేజీ నం:98.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18