సహనమూర్తులకు ఆదర్శం హజ్రత్ జైనబ్[స.అ] జీవితం.

సోమ, 04/02/2018 - 19:13

తన సోదరుని వీరమరణం తరువాత సం రక్షణ యొక్క భాద్యతలను తీసుకొని వారి సందేశాలను లోకానికి వినిపించి,బనీ ఉమయ్య ఇస్లాం పేరుతో వారు చేస్తున్న అన్యాయాలను ఈ లోకం ద్రుష్టికి తీసుకు రావడం అనేది కేవలం హజ్రత్ జైనబ్ లాంటి మహా వనితకే సాధ్యం.  

సహనమూర్తులకు ఆదర్శం హజ్రత్ జైనబ్[స.అ] జీవితం.

ఇమాం అలి[అ.స]ల పెద్ద కుమార్తె అయినటువంటి హజ్రత్ జైనబ్[స.అ] హిజ్రి యొక్క 5వ యేట మదీన నగరంలో జన్మించారు,పుట్టిన మూడవ రోజు మహప్రవక్త దేవదూత జిబ్రయీల్ సందేసానుసారం ఈ పాపకు “జైనబ్” అని నామకరణం చేసారు.
హజ్రత్ జైనబ్[స్.అ] గుండె ధైర్యాన్ని,భాష పటిమను,వీరత్వాన్ని తన తండ్రి అయినటువంటి ఇమాం అలి[అ.స] ల వారి నుండి వారసత్వంగా పొందారు,కర్బలా గాధలో సంభవించిన ఘటనలు దేవుని, అతని ధర్మంపై ఆవిడకు గల విస్వాసం పై ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.ధర్మ సంరక్షణలో ఇమాం హుస్సైన్[అ.స] కు తోడుగా నిలవడం తన సోదరునికి ధైర్యం చెప్పి తాను కూడా అన్ని విధాల కష్టాలను,బాధలను ఇస్లాం సం రక్షణ కొరకు సహించి తన సోదరుని యొక్క సందేశాన్ని సమాజం వరకు చేరవేసి కర్బలా యదార్ద గాధను దాని వాస్తవాలను ఈ నాటి వరకు సజీవంగా ఉండేటట్లుగా చేసిన మహావనిత హజ్రత్ జైనబ్ బింతె అలి[స.అ].
ఈ గొప్ప మహిళ తన సోదరులు వారి కుమారులు తన ముద్దుబిడ్డలను సైతం ఇస్లాం గురించి త్యాగం చేసి ఆ తరువాత కూడా ఇబ్నె జియాద్ యొక్క దర్బారులో  మీరు కర్బలా గాధను ఏ విధంగా చూస్తారు? అని ప్రశ్నించినప్పుడు “ఏదైతే మాతో జరిగినదో అది అప్రతిష్టత కాదు నేను మంచిని తప్ప ఏది చూడలేదు,ఆ దేవుడు కర్బలా అమరవీరులను వారి వీరమరణం కోసం ఎన్నుకున్నాడు,దేవుడు నిన్ను,వారిని[అమరవీరులను] పరలోకంలో తన ముందు హాజరు పరుస్తాడు,మీరు మీ వాదవివాదాలు అక్కడ ప్రస్తావనకు వస్తాయి,అప్పుడు ఎవరికి విజయం ప్రాప్తించినదో నువ్వు చూస్తావు”  అని పలికారు.
అన్యాయానికి,దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడి ధర్మ సం రక్షణ కొరకు తన సర్వత్వాన్ని కోల్పోయి కూడా ఆ అల్లహ్ కు క్రుతజ్ఞులై ఉండటం అనేది ఆ ప్రవక్త వంశానికే సాధ్యం,తన తల్లి మాదిరిగా ఈమే జీవితం కూడా ప్రళయ దినం వరకు వచ్చే తరాలకు ఆదర్శం అని చెప్పవచ్చు.

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్,45వ భాగం,పేజీ నం:116  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15