తన తనయునితో కాబా బయటకి ఫాతిమ బింతె అసద్ [స.అ].

మంగళ, 04/03/2018 - 16:19

ఇమాం అలి[అ.స]ల వారు జన్మించిన నాలుగవ రోజు ఫాతిమ బింతె అసద్[స.అ] కాబా నుండి బయటకు వచ్చారు,ఆ పసికందు రాక కోసం వేచి ఉన్న మహాప్రవక్త[స.అ.వ్],ఆ పసివాడిని చూసి ఎంతగానో మురిసిపోయారు.

తన తనయునితో కాబా బయటకి  ఫాతిమ బింతె అసద్ [స.అ].

ఆ దేవుని ఆజ్ఞను తెలుసుకున్న మహాప్రవక్త[స.అ.వ్] మరియు అబూ తాలిబ్[అ.స] ముందే కాబా వద్దకు చేరుకున్నారు, కాబా నుండి బయటకు విచ్చేసిన ఫాతిమ బింతె అసద్[అ.స] ఆమెతో జరిగిన సంఘటనలను తెలుపసాగారు,తన కుమారుని చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్న అబూతాలిబ్[అ.స] తన కుమారుడిని చూసి మురిసిపోసాగారు,అప్పుడు ఆ శిసువు తన తండ్రితో ''అస్సలాము అలైక యా అబీ' అని పలికాడు,దానికి జవాబుగా ''వ అలైకస్సలాం య బునయ్యా' అని పలికి ఆ శిసువును తన ఒడిలోకి తీసుకున్నారు,ఆ తరువాత మహాప్రవక్తను చూసిన ఆ పసికందు మురిసిపోయి ''అస్సలాము అలైక య రసూలల్లాహ్''అని పలికి తనను మహప్రవక్త ఒడిలోకి తీసుకోమని చెప్పాడు,మహా ప్రవక్త ఆ పసికందు సలాముకు బదులిచ్చి వారిని ప్రేమగా తన ఒడిలోకి తీసుకొని ముద్దాడారు ఆ తరువాత ఆ పసికందు చేతిలో తన చేతిని పెట్టారు ఆ తరువాత వారి కుడి చెవిలో అజాన్ మరియు అఖామత్ లను పలికారు,ఆ తరువాత  పసివాడు షహాదతైన్ లను చదివాడు.
తన కుమారుని రాకతో అబూతాలిబ్ సంతోషానికి హద్దులు లేవు,వెంటనే అందరు తన కుమారుని వలీమా కు విచ్చేయాలని మక్కా వాసులకు చాటింపు వేయించారు,ఈ వలీమాకు మూదువందల ఒంటెలను మరియు వేయి ఆవులను బలివ్వటం జరిగింది,ఆ తరువాత అబూతాలిబ్[అ.స] మకా వాసులను సంభోదిస్తూ ''ఓ మక్కా వాసులారా!వలీమాకు వచ్చే ముందు కాబా యొక్క ఏడు చక్కర్లు కొట్టండి ఆ తరువాత ఎప్పుడైతే నా ఇంట్లోకి విచ్చేస్తారొ ముందు నా కుమారునికి సలాం చేసి ఆ తరువాత వలీమాను ఆరగించండి ఎందుకంటే ఈ శిసువుకు అల్లాహ్ వద్ద ప్రత్యేకమైన స్థానము ఉన్నది" అని పలికారు,మక్కా వాసులు కూడా అబూతాలిబ్[అ.స] ఆజ్ఞానుసారంగా కాబా చుట్టూ ఏడు చక్కర్లు కొట్టి ఆ శిసువుకు సలాం చేసి  వలీమ ఆరగించి వెళ్ళారు.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,35వ భాగం.

 

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8