సూరయే వాఖియా ప్రత్యేకతలు హదీసులలో.
సూరయే వాఖియ దివ్య ఖురాన్ యొక్క 56వ సూరా,పవిత్ర మక్కాలో మహాప్రవక్త[స.అ.అ]పై అవతరింపబడినది మరియు ఈ సూరాలో 96 ఆయతులు ఉన్నాయి.
ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మహాప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా పలికారు : ఎవరైతే ఈ సూరాను పఠిస్తారో వారు నిర్లక్ష్యపు సమూహము నుండి కారు అని [అతని కర్మ చిట్టాలో] వ్రాయబడును.
ఏ సూరాలలో అయితే ప్రళయ దినం మరియు ఆ నాడు సంభవించే ఘటనల గురించి ప్రస్థావించడం జరిగిందో ఈ సూర కూదా వాటిలో నుండి ఒకటి,మరియు మహాప్రవక్త[స.అ.వ]ల వారిపై వ్రుధాప్య చాయలు రావటానికి కారణమైన సూరాలలో ఇది ఒకటి, ఇబ్నె అబ్బాస్ ఇలా పలికారు: ఒక రోజు ఒక వ్యక్తి మహాప్రవక్త[స.అ.వ]ల వారితో ఎందువలన మహాప్రవక్త[స.అ.వ]ల వారు ఇంత తొందరగా వృధ్ధులయారని ప్రశ్నించాడు,దానికి జవాబుగా ప్రవక్త[స.అ.వ]ల వారు “హూద్,వాఖియ,ముర్సలాత్,నబ మొదలైన సూరాలు నన్ను ఇంత తొందరగా వృధ్ధుని చేసాయి” అని పలికారు.
ఇమాం బఖిర్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే సూరయె వాఖియాను రోజూ నిద్రపోయే ముందు పఠిస్తారో ప్రళయదినాన ఎప్పుడైతే వారు అల్లాహ్ ముందు హాజరు పరచబడుతారో వారి ముఖము పున్నమి నాటి చంద్రుని వలె మెరుస్తుంది.
ఇమాం సదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: మీలో ఎవరైతే స్వర్గము మరియు దాని సుఖాలను కోరుకుంటారో వారు సూరయే వాఖియాను పఠించండి.
రెఫరెన్స్
మజ్మవుల్ బయాన్, 9వ భాగం, పేజీ నం:355, ఆమాలియే షేఖ్ సదూఖ్, పేజీ నం:304, సవాబుల్ ఆమాల్, పేజీ నం:117.
వ్యాఖ్యలు
مرحبا بہت خوب
بہت خوب
వ్యాఖ్యానించండి