.కూఫా వాసుల ఆహ్వానం పై ఇమామ్ హుసైన్[అ.స] పంపిన రాయబారి ముస్లిం ఇబ్నె అఖీల్.
“ముస్లిం”, అఖీల్ యొక్క అతి ప్రతిష్టత గల కుమారులలో ఒకరు. “అఖీల్”, హజ్రత్ అలీ[అ.స] యొక్క పెద్ద అన్నయ్యా మరియు అబూతాలిబ్[అ.స] యొక్క రెండవ కుమారుడు. ఈ విధంగా అతనికి అబూతాలిబ్ మరియు ఫాతెమా బింతె అసద్ దంపతుల ఒడిలో పెరిగే భాగ్యం కూడా కలిగి ఉంది. అతని తల్లి పేరు “ఖలీలహ్”(లేదా హలీలహ్). భార్య పేరు “రుఖయ్యాహ్”, ఈమె హజ్రత్ అలీ[అ.స] కుమార్తెలలో ఒకరు. ఈ విధంగా అతనికి హజ్రత్ అలీ[అ.స] యొక్క అల్లుడు అయ్యే భాగ్యం కలిగింది.
ఇతను దైవప్రవక్త[స.అ] కాలంలో లేరు, ఎందుకంటే హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో మస్లిం చనిపోయారు. అప్పుడు అతని వయసు 40 సంవత్సరాల కన్న ఎక్కువ కాదు. దైవప్రవక్త మరణం నుండి 60వ హిజ్రీకి 50 సంవత్సరములు అయ్యాయి. అంటే దైవప్రవక్త మరణించిన 10 సంవత్సరముల తరువాత ముస్లిం జన్మించారు.
ఇతని పిల్లలందరూ కర్బలాలో చనిపోయారు ఇద్దరు కుమారులు తప్ప. వారి పేర్లు ముహమ్మద్ మరియు ఇబ్రాహీమ్. వీళ్ళు కొన్నాళ్ళు కూఫాలో కారాగారంలో బందీలుగా ఉన్న తరువాత దుర్మార్గుడైన “హారిస్ బిన్ జియాద్” చేత చంపబడ్డారు. అప్పటికి వారిద్దరికి ఇంకా పదేళ్ళ వయసు కూడా పూర్తి కాలేదు. [తఅమ్ములి దర్ నహ్జతె ఆషూరా, పేజీ16]
రిఫ్రెన్స్
రసూలె జాఫరియ్యాన్, తఅమ్ములి దర్ నహ్జతె ఆషూరా, పేజీ16.
వ్యాఖ్యలు
Thaks for update.
Shukriya... Iltemase Dua.
వ్యాఖ్యానించండి