ఇన్షిఖాఖ్ సూరహ్

మంగళ, 04/10/2018 - 12:24

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 84వ సూరహ్ అయిన “ఇన్షిఖాఖ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఇన్షిఖాఖ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 84వ సూరహ్ ఇది. “ఇన్షిఖాఖ్”, పదం “షఖ్” అను పదం నుండి వచ్చింది. “ఇన్షిఖాఖ్” అనగా బద్దలవ్వడం, చీల్చబడడం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఇన్షిఖాఖ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 28 సార్లు(షఖఖ్నా, అషుఖ్ఖు, షాఖ్ఖు, తషాఖ్ఖూన, తషఖ్ఖఖు, షుఖ్ఖహ్, షఖాఖ్ మరియు షఖ్కాఖీ అని పలు రకాలుగా) వచ్చింది. ఈ సూరహ్ లో 25 ఆయత్‍లు, 108 పదాలు మరియు 444 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒకసారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఇన్ఫితార్” సూరహ్ మరియు దీని తరువాత “రూమ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఇన్షిఖాఖ్” సూరహ్ ను “ఇన్ షఖ్ఖత్” అని కూడా అంటారు. “ఇన్షిఖాఖ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “ఇన్ షఖ్ఖత్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ఇన్షిఖాఖ్” సూరహ్ ను పఠిస్తారో అల్లాహ్ అతడి కార్య పత్రికను వెనక నుండి వేయడు(అనగా నరకానికి పంపడు).[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ301].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ301.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18