అల్లాహ్ యే కష్టాల నుండి కాపాడువాడు

బుధ, 04/11/2018 - 15:54

అల్లాహ్ యే ٖమానవుని ఇహపరలోక కష్టాలను దూరం చేసే వాడు అని ఖుర్ఆన్ చెబుతుంది. వాటి సూచన.

అల్లాహ్ యే కష్టాల నుండి కాపాడువాడు

ఖుర్ఆన్, ఇహపరలోక కష్టాల నుండి రక్షించేవాడు అల్లాహ్ మాత్రమే అని చెబుతుంది. కొన్ని ఆయత్లు మీ ముందు:
1. హజ్రత్ నూహ్[అ.స] మరియు అతని సహచరులను మునిగిపోకుండా కాపాడడం:
“తుదకు మేము అతన్నీ, అతని సహచరులను నిండు నౌకలో(ఎక్కించి) కాపాడాము”[షుఅరా సూరహ్:119].
2. హజ్రత్ మూసా[అ.స] మరియు అతని సహచరులను మునిగిపోకుండా కాపాడడం:
“అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము”[బఖరా సూరహ్:50]
3. హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స]ను అగ్ని నుండి కాపాడడం:
“అల్లాహ్ అతన్ని అగ్ని నుంచి కాపాడాడు”[అన్కబూత్ సూరహ్:24)
4. ప్రవక్తలను మరియు వారిని విశ్వసించిన వారిని కాపాడడం:
“మరి మేము మా ప్రవక్తలను, విశ్వసించిన వారిని కాపాడేవారము. అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి”[యూనుస్ సూరహ్:103]
5. దుర్మార్గుల బారి నుండి కాపాడడం:
“ఫిర్ఔన్ మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు”[బఖరా సూరహ్:49]
6. ప్రతీ కష్టం నుండి కాపాడడం:
“ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్ యే. అయినా సరే మీరు (మేలును మరిచిపోయి) షిర్క్ కు ఒడిగడతారు” అని చెప్పు.[అన్ఆమ్ సూరహ్, 64].
7. ప్రళయంనాడు అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు జిహాద్ వల్ల కాపాడడం:
“ఓ విశ్వాసులారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలుపనా? మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది”[సఫ్ సూరహ్:10,11].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13