ఇమాం మూసా బిన్ జాఫర్[అ.స]

బుధ, 04/11/2018 - 17:46

ఇమాం కాజిం[అ.స] ల వారి జీవితపు సంక్షిప్త సారాంశం.

 ఇమాం మూసా బిన్ జాఫర్[అ.స]

ఇమాం మూస బిన్ జాఫర్[అ.స]ల వారు మహాప్రవక్త[స.అ.వ] యొక్క ఏడవ ఉత్తరాధికారి,ఆయన  మదీన యొక్క "అబ్వా" అనే పేరు గల ప్రదేశంలో హిజ్రత్ యొక్క 128వ యేట జన్మించారు,తండ్రి ఇమాం జాఫర్ బిన్ మొహమ్మద్[అ.స],తల్లి హమీద.హిజ్రత్ యొక్క 148వ యేట తన తండ్రి మరణానంతరం ఇమామత్ ను [ఉత్తరాధికారాన్ని]  స్వీకరించారు,ఇమాం కాజిం[అ.స] జీవితం అప్పుడే రాజ్యాధికారాన్ని స్వీకరించిన అబ్బాసి ఖలీఫాల కాలంలో  గడిచింది,ఆయన కోపాన్ని దిగమ్రింగటం మరియు ఇతరుల పట్ల మన్నింపుల వైఖరి అవలంభించటం వలన ఆయన "కాజిం"[కోపన్ని దిగమ్రింగేవాడు] గా పిలవబడ్డారు, ఎప్పుడైనా ఇతరులు తనను తన పితామహులైన ఇమాం అలి[అ.స] ల వారిని కించ పరిచి మాట్లాడినా ఇమాం కాజిం[అ.స]ల వారి వైఖరి వాటికి భిన్నంగా ఉండేది, ఒకసారి ఒక వ్యక్తి ఇదే విధంగా ఆయనను ఆయన పితామహుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు ఇమాం[అ.స]ల వారి సహచరులు అతడిని కొట్టబోతే ఇమాం[అ.స] అడ్డుపడి అతనిని క్షమించి వదిలేసారు,ప్రజల వైఖరి ఇమాం కాజిం[అ.స] ల ఆయనను కోపగించే లా ఉంటే ఇమాం [అ.స]ల వారు వారిని క్షమించి ఆ పైన వారికి ఏదో ఒక బహుమతులను ఇచ్చేవారు[తద్వార వారిలో ఏదో ఒక మార్పు రావాలని].
జ్ఞానసంపద,సదాచరపు వైఖరి,ఎల్లపుడూ ఇస్లాం పరిరక్షణ,ప్రజల యొక్క బాగోగులు కోరటం ఇలాంటి లక్షణాలలో వీరు తన పితామహులు ఇమాం అలి[అ.స]లను పోలి ఉండేవారు,ప్రజల ఆకర్షించే ఇమాం[అ.స]ల వారి ఈ వైఖిరిని చూసి అబ్బాసీ ఖలీఫాలు అసూయతో ఆయనను ద్వేషించేవారు,ఇమామత్ పై వారి అనుచరుల విస్వాసం తమ అధికారానికి ప్రమాదమని భావించి ఏదో ఒక కారణం చూపించి వారిని ఖైదు చేసేవారు,ఈ విధంగా ఇమాం[అ.స]ల వారి జీవితపు ఎక్కువ కాలం వారి బందీఖానాలోనే గడిచిపోయింది,హిజ్రి యొక్క 183వ యేట హరూన్ రషీద్ ఆదేశానుసారం ఇమాం[అ.స]ల వారు అదే చెరసాలలో విషపూరితమైన ఆహరం ద్వారా చంపబడ్డారు,ఇరాక్ లోని బగ్దాద్ లో గల ఆయన ఖనన స్థలం ఈ రోజు కూడా ప్రపంచవ్యప్తంగా నివసించే ఆయన అనుచరులకు దర్శనాస్థలంగా ఉన్నది.

రెఫరన్స్
అల్-ఇర్షాద్,షేఖ్ ముఫీద్,2వ భాగం,పేజీ నం:215,242.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8