అబ్బాసీ ఖలీఫాలు మరియు ఇమాం కాజిం[అ.స] కార్యాచరణలు

గురు, 04/12/2018 - 13:58

అబ్బాసీ ఖలీఫాల నుండి తమను తాము రక్షించుకుంటూ ఇమాం కాజిం[అ.స] ల వారు అవలంభించిన వైఖరి ప్రశంసనీయం,ఇది కేవలం ఆ అల్లాహ్ అనుగ్రహంతోనే సాధ్యం అని చెప్పవచ్చు.

అబ్బాసీ ఖలీఫాలు మరియు ఇమాం కాజిం[అ.స] కార్యాచరణలు

హిజ్రి యొక్క 148వ ఏట మహాప్రవక్త 7వ ఉత్తరాధికారిగా మరియు ముస్లిం సమాజపు నాయకత్వ భాద్యతలు స్వీకరించిన ఇమాం కాజిం[అ.స]ల వారు అదే సమయంలో రాజ్యాధికారాన్ని పొందిన అబ్బాసీ ఖలీఫాలు కేవలం తమ రాజకీయ లబ్ది కోసం ఎంతటి నీచానికైన దిగజారి ఎటువంటి పనియైన చేయటానికి వెనుకాడని స్వభావం కలిగివుండేవారు, అలాంటి సమయంలో ఇస్లాం యొక్క నైతిక విలువలను రక్షించే భాద్యత కేవలం ఆ అల్లాహ్ ద్వారా నియమింపబడ్డ ఆ ప్రవక్త యొక్క ఉత్తరాధికరులపైనే ఉంటుంది, కానీ ఈ బాధ్యత ఈ అబ్బాసీ ఖలీఫాల గూఢచారుల బారి నుండి తమను తాము కాపాడుకుంటూ ఈ కర్తవ్యాలను నెరవేర్చటం చాలా కష్టమైన పనే, కానీ ఇమాం కాజిం[అ.స]ల వారు తమ తండ్రి ఇమాం సాదిఖ్[అ.స] వారి మాదిరిగానే వారు అనుసరించిన బాటలోనే నడిచి తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేవారు.
ఇమాం కాజిం[అ.స]ల వారు అబ్బాసీ ఖలీఫాల రాజకీయలలో జోక్యం చేసుకొకుండా సమాజానికి వెన్నెముకగా ఉండే ఇస్లామీయ నైతిక విలువలు మరియు ఇస్లామీయ సాంస్కృతి యొక్క రక్షణలో నిమగ్నమయ్యారు, షైఖ్ ఇబ్నె తావూస్ ఈ విధంగా పలికారు: "ఇమాం కాజిం[అ.స] అనుచరులు మరియు తన కుటుంబీకులు వారు ఇచ్చే ప్రసంగాలను విని వాటిని రహస్యంగా తమతో తెచ్చిన పలకలపై లిఖించేవారు",ఇదే విధంగా ఇమాం బాఖిర్,సాదిఖ్[అ.స]ల ద్వారా స్థాపింపబడ్డ జాఫరి విధ్యాలయాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది జ్ఞానులను హదీసు,ఖురాన్ వ్యాఖ్యానం,ఇస్లామీయ వేదాంతం మరియు ఇతర విభాగాలలో వారికి శిక్షణ ఇచ్చేవారు,వారే తర్వాతి కాలంలో విద్వాంసులు మరియు పండితులుగా వెలిగారు, షేఖ్ తూసి తన పుస్తకమైన"రిజాలె తూసి"లో వారి సంఖ్యను 270 గా పేర్కొన్నారు.
ఇమాం కాజిం[అ.స]ల వారు తన దైవ జ్ఞానంతో వివిధ రంగాలలో[వ్యాఖ్యానం,హదీసు,ఫిఖా,ఇస్లామీయ వేదాంతం..]మరియు ఇతర శాస్త్రీయ అంశాలపై విద్యా చర్చలలో మరియు ప్రశ్నోత్తరాలలో పాల్గొని వారి సందేహాలకు జవాబిచ్చేవారు.
ఇమాం కాజిం[అ.స],అబ్బాసీ ఖలీఫాల అధికారానికి వ్యతిరేకంగా ఉన్నా,తన వ్యతిరేకతను అందరి ముందు తెలియపరచకుండా తన వ్యతిరేక వైఖరి ద్వారా దానికి సమాధానం ఇచ్చేవారు,ఎన్నో సార్లు అబ్బాసీ ఖలీఫాలు తనను అడ్డు పెట్టుకొని తమ రాజకీయ లక్ష్యాలను పొందటానికి ప్రయంత్నించినప్పుడు ఇమాం[అ.స]ల వారు వాటి నుంచి తెలివిగా తప్పించుకొని వారిని ఆ పని చేయకుండా అడ్డుపడేవారు,ఇమాం కాజిం[అ.స] ప్రజలలో ఉంటే తమ ఆగడాలు సాగవని తెలుసుకొన్న ఖలీఫాలు వారిని ఎదో ఒక కారాగారంలో బందీగా ఉంచసాగారు,చివరికి అసూయతో రగిలిపోయిన వారు వారిని విషపూరిత ఆహరం ద్వారా[కర్జూరంలో విషాన్ని కలిపి]  పొట్టనబెట్టుకోవటం జరిగింది,తద్వారా ఎంతో మందికి వెలుగు,జ్ఞానప్రకాశం ప్రసాదించిన ఈ సూరీడు చివరికి హిజ్రి 183వ యేట,రజబ్ మాసపు 25వ తరీకున ఇరాక్ లోని బాగ్దాద్ నగరంలో అస్తమించాడు.

రెఫరెన్స్: అన్వారుల్ బహియ్యహ్,పేజీ నం:169,170,రిజాలె షేఖ్ తూసి,పేజీ నం:342,366.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15