దైవప్రవక్తలపై వ్యతిరేకుల ఆరోపణలు

ఆది, 04/15/2018 - 16:30

అల్లాహ్ తరువు నుండి అవతరించబడ్డ దైవప్రవక్తలపై వారి వ్యతిరేకులు వారు అసత్యులనీ, మాంత్రికులనీ మరియు ఉన్మాదులనీ ఆరోపించారు అన్న విషయం పై ఖుర్ఆన్ నిదర్శనం.

దైవప్రవక్తలపై వ్యతిరేకుల ఆరోపణలు

దైవప్రవక్తల పట్ల వైరం మరియు ద్వేషం కలిగి ఉన్న వారు ఏమాత్రం వారిని ధనం పరంగా గాని లేదా హంతకుడుగా గాని లేదా ఇలాంటి వాటి ద్వార అభియోగించలేకపోయారు. ఎందుకంటే వారి జీవన విధానమే అలా ఉండేది వారి పై ఇటువంటి ఆరోపణలు ప్రజలు అంగీకరించే వారు కాదు. అందుకని వారిని తెలుసుకోలేనటువంటి ఆత్మపరమైన మరియు మనోపరమైన వాటిని ఆరోపించేవారు, ఉదాహారణకు మంత్రతంత్రాలు, వశీకరణం, మరియు ఉన్మాదితనం వంటి ఆరోపణలు.
వాటి పై కొన్ని ఖుర్ఆన్ నిదర్శనలు
1. 2. మంత్రతంత్రలు మరియు ఉన్మాదితనం ఆరోపణ: ఇలాగే వీరికి పూర్వం గడిచిన వారు కూడా తమ వద్దకు వచ్చిన ప్రవక్తను గిరించి, “ఇతడు మాంత్రికుడైనా అయి ఉంటాడు లేదా పిచ్చివాడైనా అయి ఉంటాడు” అనేవారు.[జారియాత్ సూరహ్:52].
3. అసత్యులు అన్న ఆరోపణ: “...పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.[అఅరాఫ్:67].
4. భూమి పై అరాచకం సృష్టించేవారు అన్న ఆరోపణ: ఫిర్ఔన్ ఇలా అన్నాడు: “నన్ను వదలండి. నేను మూసాను చంపేస్తాను. అతడు తన ప్రభువును పిలుచుకోనివ్వండి. ఇతడు మా మతాన్ని ఎక్కడ మార్చివేస్తాడో లేక భువిలో అరాచకాన్ని ఎక్కడ సృష్టిస్తాడోనని నేను భయపడుతున్నాను”[గాఫిర్ సూరహ్:26].
5. వాదించేవారు, జగడం చేసే వారు అన్న అరోపణ: “ఓ నూహ్! నువ్వు మాతో వాదించావు. మరీ మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని(శిక్షను) తీసుకురా” అని అతని జాతి వారు అన్నారు.[హూద్ సూరహ్:32].
6. వారు చెప్పే మాటలు కట్లుకథులు అన్న ఆరోపణ: అవిశ్వాసులు “ఇవి పూర్వీకుల నుంచీ చెలామణిలో ఉన్న కట్టలుకథులు తప్ప మరేమీ కావు” అని అంటారు.[అన్ఆమ్ సూరహ్:25].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24