అల్లాహ్ మానవునిని ఈ లోకంలో ఎన్నొ విధాలుగా పరీక్షిస్తాడు తద్వారా అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోనే శక్తి సమకూరుతుంది,ఆ అల్లాహ్ అనుగ్రహానికి కూడా పాత్రుడవుతాడు.

కేవలం మానవుని బాహ్యరూపాన్ని చూసి అతని కార్యాలకు ప్రతిఫలన్ని ఇవ్వడం సరికాదు,అందుకే అల్లాహ్ తన దాసులను వివిధ సందర్భాలలో పరీక్షిస్తాడు తద్వారా వారి మనస్సులలో అల్లాహ్ కు ఏ మాత్రం ప్రేమ,భయభక్తి ఉన్నదో తెలుసుకోవడానికి,ఈ పరీక్షకు అర్ధం ఏమిటి?అసలు అల్లాహ్ తన భక్తులను ఎన్ని విధాలుగా పరీక్షిస్తాడు అన్నదానికి మాత్రం దివ్య ఖురానే సమాధానం చెప్పాలి.
1. కష్ట సుఖాలకు గురిచేయటం ద్వారా:
كُلُّ نَفْسٍۢ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِٱلشَّرِّ وَٱلْخَيْرِ فِتْنَةًۭ ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ
ప్రతి ప్రాణీ మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు (కలిమి లేములకు) గురిచేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు [అంబియా/35].
2. సహనమూర్తులెవరో తెలుసుకోవటానికి:
وَلَنَبْلُوَنَّكُمْ حَتَّىٰ نَعْلَمَ ٱلْمُجَٰهِدِينَ مِنكُمْ وَٱلصَّٰبِرِينَ وَنَبْلُوَا۟ أَخْبَارَكُمْ
మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో, సహనమూర్తులెవరో నిగ్గుతేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము [మొహమ్మద్/31].
3. మంచి కార్యములు చేసేవారెవరో తెలుసుకొనుటకు:
إِنَّا جَعَلْنَا مَا عَلَى ٱلْأَرْضِ زِينَةًۭ لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًۭا“
జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూ మండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయ మానంగా చేశాము”.[అల్-కహఫ్/7].
మరెన్నొ కారణాలను దివ్య ఖురాన్ ప్రస్థావిస్తుంది,కానీ ఈ లోకంలో ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ప్రతిఫలం ఏమిటి అన్న దానికి అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
أُو۟لَٰٓئِكَ عَلَيْهِمْ صَلَوَٰتٌۭ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌۭ ۖ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُهْتَدُونَ
“వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే”.[అల్-బఖర/155].
వ్యాఖ్యలు
Masha Allah
వ్యాఖ్యానించండి