త్యాగానికి,వీరత్వానికి ప్రతీక అయిన ఇమాం హుసైన్[అ.స]ల వారి జన్మదిన విశేషాలు
మహప్రవక్త మూడవ ఉత్తరాధికారి మరియు మునిమనుమడు అయినటువటి ఇమాం హుసైన్[అ.స]ల వారు షాబాన్ మాసపు మూడవ తారీకున హిజ్రత్ యొక్క 4వ యేట పవిత్ర మదీన నగరంలో జన్మించారు తండ్రి ఇమాం అలి[అ.స],తల్లి ప్రపంచ మహిళలలో శ్రేష్టురాలైన హజ్రత్ ఫాతిమ జహ్ర[స.అ],తన ప్రియ మనుమని జన్మవార్త విన్న మహాప్రవక్త వారి వద్దకు విచ్చేసి ఈ పసివానికి ఏమని నామకరణం చేసారు?అని ఇమాం అలి[అ.స]ల వారిని ప్రశ్నించారు,దానికి ఇమాం అలి[అ.స]ల వారు ఈ పసివాని నామకరణంలో నేను మిమ్మల్ని మించలేను [ఇంకా నామకరణం జరగలేదు] అని అన్నారు,అది విన్న మహాప్రవక్త[స.అ.వ] నేను కూడా ఈ పనిలో ఆ అల్లాహ్ ను మించలేను అని అన్నారు.
కొద్దిసేపటి తరువాత ఆ అల్లాహ్ ఆజ్ఞతో వచ్చిన జిబ్రఈల్[అ.స]ల వారు ఈ విధంగా పలికారు: ఆ అల్లాహ్ మీకు తన సలామును తెలిపి మీకు అలి[అ.స]కు గల సంబంధం,ప్రవక్త మూసా[అ.స] కు హరూన్ కు గల సంబంధం లాంటిది,అందువలనే ఈ పసివానికి హారూన్ కుమారుని పేరు మీదనే నామకరణం చేయమని ఆజ్ఞాపించెను,దానికి మహాప్రవక్త[స.అ.వ]ల వారు: హారూన్ కుమారుని పేరేమిటి? అని ప్రశ్నించెను,హారూన్ కుమారుని పేరు "షబ్బీర్" అని పలికెను,కానీ మా అరబీ భాషలో దానికి పర్యాయపదం ఏమిటి అని మహాప్రవక్త[స.అ.వ] ప్రశ్నించెను,దానికి అరబీ భాషలో పర్యాయపదం “హుసైన్”,ఆ పసివానికి “హుసైన్” అని నామకరణం చేయుము అని అన్నారు,ఈ విధంగా ఆ అల్లాహ్ ఆజ్ఞానుసారం ఇమాం హుసైన్[అ.స] నామకరణం జరిగింది.
మహనీయ ప్రవక్త[స.అ.వ]ల వారు ఇమాం హుసైన్[అ.స] ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రవచించిన హదీసులు ఎన్నొ ఉన్నాయి వాటిలో ''హుసైన్[అ.స] నాతో మరియు నేను హుసైన్[అ.స] తో" మరియు "నిస్చయంగా హసన్[అ.స],హుసైను[అ.స]ల వారు స్వర్గపు యౌవనుల[యువకుల] యొక్క నాయకులు''ప్రముఖమైనవి.
రెఫరన్స్: ఆయానుష్ షియా,6వ భాగం,పేజీ నం:167,మ ఆనిల్ అఖ్బార్,పేజీ నం:57.
వ్యాఖ్యలు
Masha Allah
ماشا ء اللہ بہت خوب
جزاک اللہ
Mashaallah
Mashaallah
Mashaallah
Mashaallah
వ్యాఖ్యానించండి