హజ్రత్ అబ్బాస్ ఇబ్నె అలీ[అ.స]

గురు, 04/19/2018 - 05:29

కర్బలా యుద్ధభూమి పై ఇమామ్ మరియు నాయకుడి పట్ల విధేయతను చాటి చూపిన హజ్రత్ అబ్బాస్[అ.స] యొక్క జన్మదిన శుభాకాంక్షలు.

హజ్రత్ అబ్బాస్ ఇబ్నె అలీ[అ.స]

అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కుమారుడూ, సయ్యదుష్షుహదా అయిన ఇమామ్ హుసైన్[అ.స] సొదరుడూ, ఆషూరా రోజు హుసైనీ సైన్యానికి అధిపతీ, ఫాతెమా జహ్రా[అ.స] తన బిడ్డగా భావించేటు వంటి ప్రవీణత గలవారూ, వీరుల వంశానిక చెందిన ఉమ్ముల్ బనీన్ లాంటి పవిత్ర మాతృమూర్తి జన్మనిచ్చినటువంటి వీరుడూ, కర్బలా యుద్ధభూమి పై ఇమామ్ మరియు నాయకుడి పట్ల విధేయతను చాటి చూపిన హజ్రత్ అబ్బాస్[అ.స] యొక్క జన్మదిన శుభాకాంక్షలు.
“అబ్బాస్” అనగ ఇతర సింహాలు చూసి భయపడేటువంటి సింహం. ఫాతెమా జహ్రా[స.అ] మరణాంతరం ఇమామ్ అలీ[అ.స] ఉమ్ముల్ బనీన్[అ.స] తో వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే హజ్రత్ అబ్బాస్[అ.స]. ఇతను హిజ్రత్ యొక్క 26వ సంవత్సరం, షాబాన్ మాసం 4వ తారీఖున మదీనలో జన్మించారు. ఇతనికి ముగ్గురు సొదరులు, అందరూ కర్బలా యుద్ధంలో ఇస్లాం రక్షణకై తమ ప్రాణాలను అర్పించుకున్నారు. తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] మరణించినప్పుడు హజ్రత్ అబ్బాస్[అ.స] వయసు 14 సంవత్సరాలు, మరియు కర్బాలలో 34 సంవత్సరాలు. ఇతను కర్బలా యుద్ధంలో ఇమామ్ ఆజ్ఞను అనుచరిస్తూ ఇస్లాం రక్షణకై తన ప్రాణాలు అర్పించారు. [ఫర్హంగె ఆషూరా, పేజీ294].

రిఫ్రెన్స్
జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.
   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9