ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో పాటు వారి గురించి సంక్షిప్తంగా.
![ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] జన్మదినం](https://te.btid.org/sites/default/files/field/image/pic-65442-1463031423.jpg)
ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త[స.అ] నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్[అ.స] జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.
ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] కర్బలా యుద్ధం సమయంలో కర్బలాలోనే ఉన్నారు, కాని అనారోగ్యం వల్ల యుద్ధం చేయలేకపోయారు. ఇమామ్ హుసైన్[అ.స] మరణాంతరం వారిని గొలుసులతో బంధించి దయాదాక్షిణ్యాలు లేకుండా కొరడాలతో కొడుతూ కర్బలా నుండి కూఫాకు మరియు అక్కడ నుండి షామ్ పట్టణానికి తీసుకొని వెళ్ళారు. షామ్ చేరిన తరువాత యజీద్ రాజ్యసభలో ముఖ్యమైన, సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు దానితో షామ్ ప్రజలకు కర్బలా యుద్ధం యొక్క యదార్థం తెలిసింది. చివరికి యజీద్ కు వారిని విడుదల చేయవలసి వచ్చింది.
ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] హిజ్రీ యొక్క 37వ సంవత్సరం, షాబాన్ మాసం 4వ తారీఖున మదీనహ్ లో జన్మించారు. కర్బలా యుద్ధం సమాయంలో అతని వయసు 24 సంవత్సరాలు. వారి తండ్రి ఇమామ్ హుసైన్[అ.స] మరణాంతరం 35 సంవత్సరాలు ఇమామత్ బాత్యను నిర్వర్తించి చివరికి దుర్మార్గుల విషప్రయోగం ద్వార మరణించారు.[ఫర్హంగె ఆషూరా, పేజీ216]
రిఫ్రెన్స్
జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.
వ్యాఖ్యానించండి