ఇమామ్ జైనుల్ ఆబిదీన్[అ.స] ప్రార్ధనా విధానం

శని, 04/21/2018 - 19:00

ఇమాం జైనుల్ ఆబిదీన్[అ.స] ల వారు ఆ అల్లాహ్ ప్రార్ధనకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి సంక్షిప్త వివరణ.

ఇమామ్ జైనుల్ ఆబిదీన్[అ.స] ప్రార్ధనా విధానం

ఎలగైతే ఆ మహాప్రవక్త[స.అ.వ] దైవారాధనకు మరియు ప్రార్ధనలకు విలువనిచ్చేవారో అదే విధంగా ఆయన ఉత్తరాధికారులు కూడా దానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు,కానీ కొందరిలో ఈ లక్షణం ఎక్కువగానే చూడటం జరిగింది వారిలో నుండి ఇమాం అలి ఇబ్నుల్ హుసైన్[అ.స] ఒకరు,ఇమాం[అ.స]ల వారు ప్రార్ధనకు ఇచ్చే ప్రాముఖ్యతను మరియు వారు దానికి కేటాయించే సమయాన్ని చూసిన వారు ఆయనను “జైనుల్ ఆబిదీన్” అని పిలవసాగారు,అదే కాకుండా వారి యొక్క చాల సేపు వారు ఆ దేవుని సన్నిధిలో చేసే సజ్దాలు[సాష్టాంగ నమస్కారాలు] వారిని సయ్యదుస్ సాజిదీన్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి.
ఇమాం[అ.స] అనుచరులలో ఒకరైన తాఊస్ ఇబ్నె కైసానె యమాని వారి గురించి ఈ విధంగా పలికారు: "నేను ఇమాం[అ.స]ల వారిని హజ్రె ఇస్మాఈల్[కాబ వద్ద గల ఒక పవిత్రమైన చోటు] వద్ద చూసను వారు ఆ అల్లాహ్ ప్రార్ధనలో మరియు స్తోత్రంలో నిమగ్నమై ఉన్నారు,ఎప్పుడైతే వారు నమాజు నిమిత్తం నిలబడ్డారో కొన్ని సార్లు వారి ముఖం పసుపు రంగులోకి మారటాన్ని మరి కొన్ని సార్లు నీలపు రంగులోకి మారటాన్ని నేను గమనించాను,వారి శరీరంలో ఆ భగవంతునికి గల భయాన్ని చూసాను,వారు ఆ నమాజును తన జీవితపు ఆఖరి నమాజువలె చేసారు,ఎప్పుడైతే సజ్దాలోకి [సాష్టాంగ నమస్కారం] వెళ్ళారో చాల సమయాన్ని సజ్దాలోనే గడిపారు,ఎప్పుడైతే సజ్దా నుండి తలను ఎత్తారో వారి దేహం మొత్తం చేమటతో తడిచిపోవటం జరిగింది".
మరెన్నో హదీసులలో వారి యొక్క ప్రార్ధనా విధానాన్ని మరియు భగవంతుని భక్తిలో వారి యొక్క స్తితిని వివరించడం జరిగింది,ఇమాం[అ.స] ల వారి ఈ ప్రార్ధనకు ఇచ్చే ప్రాముఖ్యత వారి శత్రువులను సైతం ఆస్చర్యానికి గురి చేసింది,కర్బలా గాధలో కూడా కష్టాలను సైతం లెక్కజేయకుండా వారు ఈ నమాజుకు మరియు ప్రార్ధనలకు ఇచ్చిన ప్రాముఖ్యత చూసినట్లైతే వారు నిజంగానే సయ్యిదుస్ సాజిదీన్[ప్రార్ధించే వాళ్ళకు నాయకుడు] మరియు జైనుల్ ఆబిదీన్[అల్లాహ్ దాసులకు శోభ] అని అంగీకరించక తప్పదు.  

రెఫరన్స్:
సైరొ ఆలమిన్ నుబలా, 4వ భాగం, పేజీ నం:393,394.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10