మహా ప్రవక్త[స.అ.వ] మరియు అహ్లెబైత్[అ.స] పై దురూద్

గురు, 04/26/2018 - 17:38

మహాప్రవక్త[స.అ.వ] మరియు అతని ఇంటివారిపై దురూద్ పంపడానికి గల ప్రాముఖ్యత ఖురాన్ మరియు హదీసుల అనుసారంగా.

మహా ప్రవక్త[స.అ.వ] మరియు అహ్లెబైత్[అ.స] పై దురూద్

మహప్రవక్త[స.అ.వ] పై మరియు అతని అహ్లెబైత్[ఇంటివారు]పై దురూద్ పంపడం అనేది ఆ అల్లాహ్ దాసులు ఆ అల్లాహ్ నుండి తమపై అతని కరుణను కోరుకోవడమే,ఎందుకంటే మహాప్రవక్త[స.అ.వ] ఆ భగవంతునికి మరియు అతని దాసులకు మద్యస్తంగా ఉన్నారు,దాసులు ఏ నోటితో అయితే పాపాలకు పాల్పడ్డారో ఆ నోటితో ఆ అల్లాహ్ క్షమాపణను ఎలా కోరగలరు?అందుకే ఆ భగవంతుదు తన దాసులకు తనకు మధ్య ఆ మహనీయ ప్రవక్త[స.అ.వ]ల వారిని మధ్యవర్తిగా ఉంచడం జరిగింది,ఆ అల్లాహ్ కరుణను మరియు అతని దయను పొందటానికి గల సులువైన మార్గం కేవలం ఆయన మరియు ఆయన ఇంటివారిపై దురూద్ పంపడమే.
అల్లాహ్ దివ్యఖురాన్లో ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు:
إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّ ۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا
నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి 'సలాములు' పంపుతూ ఉండండి[అల్-అహ్జాబ్/56].
మహా ప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: “ఎవరైతే నాపై దురూద్ ను పంపుతారో అల్లాహ్ మరియు అతని దేవదూతలు అతనిపై తమ దురూద్ ను పంపుతారు,ఎవరు ఎక్కువగా దురూద్ పంపాలనుకుంటారో మరియు ఎవరు తక్కువగా పంపుతారో వారి ఇష్టం”.
వేరే చోట ఈ విధంగా పలికారు: “ఎవరైతే నాపై మరియు నా వంశులపై దురూద్ ను పంపుతారో వారి నుండి కపటం దూరమవుతుంది”.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: [ప్రళయ దినాన] ఏ ఒక్క కార్యము కూడా తక్కెడలో దురూద్ కన్నా బరువైనది కాబోదు,ఒక వేళ ఎవరి కార్యముల యొక్క పళ్ళెమైనా తేలికగా ఉంటే మహా ప్రవక్త[స.అ.వ] వారు దురూద్ యొక్క పుణ్యాన్ని ఆ తక్కెడలో ఉంచుతారు,దాని కారణంగా అతని కార్యముల పళ్ళెము బరువుగా మారుతుంది.
మహాప్రవక్త వేరే చోట దురూద్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా పలికారు: “ఎవరైతే నాపై నా ఇంటివారిపై పది సార్లు దురూద్ ను పంపుతారో అల్లాహ్ మరియు అతని దేవదూతలు అతనిపై వంద సార్లు దురూద్ ను పంపుతారు,ఎవరైతే వంద సార్లు దురూద్ ను పంపుతారో వారు[అల్లాహ్ మరియు అతని దేవదూతలు] వెయ్యి సార్లు అతనిపై తమ దురూద్ ను పంపుతారు”.

రెఫరన్స్
షైఖ్ కులైని, అల్-కాఫి, 2వ భాగం, పేజీ నం:492, హదీసు నం:7,8,13.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7