ఇమాం మెహ్ది[అ.స] రాజ్యాధికార ప్రస్థావన అహ్లె సున్నత్ గ్రంధాలలో

సోమ, 04/30/2018 - 18:54

చివరి ఉత్తరాధికారి యొక్క రాజ్యాధికారాన్ని ఏ మతం వారు వ్యతిరేకించలేదు కానీ అతను ఎవరు మరియు అతను ఎలా ఉండబోతున్నాడు? అన్న దాని మీదే వారి మధ్య భేదాలున్నాయి.

ఇమాం మెహ్ది[అ.స] రాజ్యాధికార ప్రస్థావన అహ్లె సున్నత్ గ్రంధాలలో

దౌర్జన్యం మరియు క్రూరత్వంతో నిండిపోయిన ఈ లోకంపై చివరికి ఒక యుగపురుషునికే అంతిమ విజయం వరిస్తుందని కేవలం ముస్లిములే కాకుండా అన్ని మతాలవారు విశ్వసిస్తారు మరియు  కేవలం ఖురాన్ లోనే కాకుండా అన్ని గ్రంధాలలో ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది,దివ్య ఖురాన్లో అల్లహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَلَقَدْ كَتَبْنَا فِى ٱلزَّبُورِ مِنۢ بَعْدِ ٱلذِّكْرِ أَنَّ ٱلْأَرْضَ يَرِثُهَا عِبَادِىَ ٱلصَّٰلِحُونَ
సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్‌(గ్రంథం)లో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము[అంబియా/105].
వేరే చోట ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا۟ فِى ٱلْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةًۭ وَنَجْعَلَهُمُ ٱلْوَٰرِثِينَ
“భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలనీ, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనీ, వారిని (భూమికి) వారసులుగా చేయాలనీ మేము కోరుకున్నాం”[అల్-ఖసస్/05].
కానీ అతని పేరేమిటి మరియు అతను ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అన్న దానికి జవాబు హదీసులలొ దొరుకుతుంది,అహ్లె సున్నత్ ల వారి పుస్తకాలలో సైతం అలాంటి హదీసులు ప్రస్థావనకు వచ్చాయి,మహాప్రవక్త[స.అ.వ]ఈ విధంగా సెలవిస్తున్నారు: “ప్రళయం సంభవించదు కానీ నా అహ్లెబైత్[వంశం] నుండే ఒక వ్యక్తి అతని పేరు నా పేరే[మొహమ్మద్] అయి ఉంటుంది అతను నాయకత్వ భాద్యతలు స్వీకరిస్తాడు”.
వేరే హదీసులో మహాప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా పలికారు: “అతని పేరు మహ్ది మరియు అతను ఫాతిమ[స.అ] కుమారులలో నుండి అయ్యి ఉంటాడు”.
ఇతర ఉత్తరాధికారుల లక్షణాలను ప్రస్థావిస్తూ మహనీయ ప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “నా తరువాత పన్నెండు మంది ఉత్తరాధికారులు ఉంటారు మరియు వారందరు ఖురైష్ వంశస్తులే”.

రెఫరెన్స్
ముస్నదే అహ్మద్ బిన్ హంబల్, 1వ భాగం, పేజీ నం:376. సహీహ్ బుఖారి, 4వ భాగం, కితాబుల్ అహ్కాం, పేజీ నం:175. సుననె ఇబ్నె దవూద్, 4వ భాగం, ముస్తద్రకే హాకిం.

 

 

                                

 

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14