గైబతె సుగ్రా కాలంలో ఇమామ్[అ.స] యొక్క ప్రతినిధులు

మంగళ, 05/01/2018 - 13:52

గైబతె సుగ్రా, గైబతే కుబ్రా మరియు గైబతె సుగ్రా సమయంలో ఇమామ్[అ.స] యొక్క ప్రతినిధులు ఎవరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

గైబతె సుగ్రా సమయంలో ఇమామ్[అ.స] యొక్క ప్రతినిధులు

ఇమామ్[అ.స] మనకు కనిపించకుండా అదృశ్యంగా ఉన్న కాలాన్ని రెండుగా విభజించడం జరిగింది: 1. గైబతే సుగ్రా 2. గైబతే కుబ్రా.
గైబతే సుగ్రా కాలం అనగా ఆ రోజుల్లో ఇమామ్[అ.స] మరియు ప్రజల మధ్య ఇమామ్ తరపు నుండి నియమించబడ్డ ప్రతినిధులు ఉండేవారు. వాళ్ళు ఇమామ్[అ.స] మరియు ప్రజల మధ్యస్థులుగా ఉండేవారు. వాళ్ళు ఇమామ్[అ.స]ను కలిసే వారు. ఇమామ్ వారికి తప్ప మరెవ్వరికీ కనబడేవారు కాదు. కొంతకాలం తరువాత “గైబతే కుబ్రా” కాలం మొదలయ్యింది. గైబతే కుబ్రా కాలంలో ఇక ఇమామ్ ఎవ్వరికి కనబడకుండా అదృశ్యమయ్యారు. ఇమామ్[అ.స] మరలా అల్లాహ్ ఆజ్ఞతో ప్రత్యేక్షమయ్యే వరకు “గైబతే కుబ్రా” కాలం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము “గైబతే కుబ్రా” కాలంలో ఉన్నాము.
ఆ “గైబతే సుగ్రా” కాలంలో ఉన్న ఇమామ్[అ.స] ప్రతినిధుల నలుగురు. వారిని “నవ్వాబె అర్బఅహ్” అంటారు. వారి పేర్లు:
1. అబూ అమ్ర్ ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ
2. అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ
3. అబుల్ ఖాసిమ్ హుసైన్ ఇబ్నె రౌ(రూ)హె నౌబఖ్తీ
4. అబుల్ హసన్ అలీ ఇబ్నె ముహమ్మదె సమరీ [ఆయానుష్షియా, భాగం2, పేజీ48].

రిఫ్రెన్స్
సయ్యద్ మొహ్సిన్ అమీన్, ఆయానుష్షియా, భాగం2, పేజీ48.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19