హృదయం యొక్క ఆయువు మరియు మృత్యువు

శుక్ర, 05/04/2018 - 17:14

మానవుడు ఒక వేళ ఉపదేసాలను వినడం మానేస్తే మెల్లమెల్లగా  అతని హృదయం చనిపోతుంది, అందువలనే దానిని ఉపదేసించడం ద్వారా సజీవంగా ఉంచుకోవటం మంచిది.

హృదయం యొక్క ఆయువు మరియు మృత్యువు

ఏ విధంగా అయితే మానవుని శరీరానికి జీవితం మరియు మరణం అనేది ఉంటుందో మానవుని హృదయానికి కూడా జీవితం మరియు మరణం అనేది ఉంటుంది,ఒక  హదీసులో మాసూం [అ.స]ల వారు ఈ విధంగా దేవునితో ప్రార్ధిస్తున్నారు: ఓ భగవంతుడా తౌబా[పశ్చ్యాతాపం] ద్వారా నా హృదయానికి జీవితాన్ని ప్రసాదించు అన్నారు,అంటే ఆ హృదయానికి మ్రుత్యువుతో పాటు జీవితం అనేది కూడా ఉంటుందని తెలుస్తుంది.
ఇమాం జైనుల్ ఆబిదీన్[అ.స]ల వారు ఈ విధంగా ఆ దేవునితో విన్నవించుకొంటున్నారు: “దేవుడా! నా తప్పులు నన్ను అవమానకరం అనే వస్త్రంతో కప్పేసాయి మరియు నేను చేసిన పెద్ద పాపాలు నా హృదయాన్ని చంపేసాయి”.
హృదయం మృతి చెందటానికి గల కారణం:
మహనీయ ప్రవక్త[స.అ.వ]ల వారు హృదయం యొక్క మృతికి గల కారణాన్ని ప్రస్థావిస్తూ ఈ విధంగా పలికారు: నీచమైన స్వభావం కలిగినటువంటి వారి తోడు మానవుని హృదయం యొక్క మృతికి కారణం,నీచుని తోడు వలన మానవుడు ఎలాంటి గోతిలో పడతాడంతే వాడు ఇతరుల కొరకు గుణపాఠంగా మారిపోతాడు.
హృదయన్ని ఎలా బ్రతికించుకోవాలి?
ఇమాం అలి[అ.స]ల వారు తన కుమారుడైన ఇమాం హసన్[అ.స]ల వారికి హృదయాన్ని బ్రతికించుకోవాలని ఉపదేసిస్తూ ఈ విధంగా పలికారు: “ఓ నా హ్రుదయపుతునకా![నా సంతానమా!] ఉపన్యాసాలను వింటూ నీ హ్రుదయాన్ని బ్రకించుకొనుము”.

రెఫరన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, 74వ భాగం,పేజీ నం:45,నెహ్జుల్ బలఘా,31వ లేఖ.

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5