. గదీర్ సంఘటనను నిసాయి, జైద్ బిన్ అర్ఖమ్ ద్వార అల్ ఖసాయిస్ పుస్తకంలో రివాయత్ ను ఉల్లేఖించారు.
“నిసాయి”, తన పుస్తకం “అల్ ఖసాయిస్”లో “జైద్ బిన్ అర్ఖమ్” ద్వార రివాయత్‌ను ఉల్లేఖించారు: అతను ఇలా అన్నారు: “దైవప్రవక్త(స.అ), హజ్జతుల్ విదా నుండి తిరిగి వస్తుండగా “గదీరె ఖుమ్”లో దిగినప్పుడు కర్రలతో పీఠాన్ని తయారు చేయమని ఆదేశించారు. ఆ పని పూర్తయిన తరువాత ఇలా అన్నారు: బహుశ ఈ సారి అల్లాహ్ తరపు నుండి పిలుపు రావచ్చు మరి నేను దానిని అంగీకరించ వచ్చు (అందుకని) మీ మధ్య అత్యంత విలువైన రెండు వస్తువులను విడిచి వెళ్తున్నాను అందులో ఒకటి, మరోదానితో పెద్దది, అల్లాహ్ గ్రంథం మరియు నా ఇత్రత్(వారే) నా అహ్లెబైత్(అ.స)లు (కూడాను). నా తరువాత ఈ రెండింటితో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాను. (ఈ విషయాన్ని నా నుండి వినుకోండి) ఈ రెండు నా వద్ద (కౌసర్) సేలయేరుకు చేరనంత వరకు వాటిలో ఎటువంటి విభేదం మరియు దూరం ఎర్పడదు. ఆ తరువాత ఇలా అన్నారు: అల్లాహ్ నాకు మౌలా(స్వామి), నేను ప్రతీ విశ్వాసుని స్వామిని, ఆ తరువాత అలీ(అ.స) చేయ్యిని పట్టి ఇలా ప్రకటించారు: నేను ఎవ్వరి వలీ(స్వామి)నో అలీ(అ.స) అతని వలీయే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు. “అబుల్ తుఫైల్” ఇలా ప్రశ్నించాడు: ఓ జైద్ నీవు విన్నావా? జైద్ ఇలా అన్నారు: అవును(నేనే కాదు) ఆ మైదానంలో ఉన్న వారందరూ తమ తమ కళ్ళతో చూశారు మరియు తమ తమ చెవులతో విన్నారు”.[కితాబుల్ ఖసాయిస్, పేజీ21]
రిఫ్రెన్స్
నిసాయి, కితాబుల్ ఖసాయిస్, పేజీ21.
వ్యాఖ్యానించండి