రమజాన్ మాసం సందర్భాలు

బుధ, 05/16/2018 - 04:36

ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం రమజాన్ పవిత్ర మాసం తొమ్మిదవ మాసము. ఇస్లామీయ చరిత్ర ప్రకారం ఇందులో సంభవించిన కొన్ని ముఖ్య సందర్భాల సూచన.

రమజాన్ మాసం సందర్భాలు

3వ తారీఖు: హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో తబూక్ యుద్ధం జరిగింది. హిజ్రీ యొక్క 413 సంవత్సరంలో ఇస్లాం ప్రపంచానికే వెన్నుముక అయినటువంటి ఆలిమ్, ముహద్దిస్, ఫఖీహ్ అయిన షేఖ్ ముఫీద్ మరణించారు.
7వ తారీఖు: బేసత్ యొక్క 10వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] పినతండ్రి అయిన హజ్రత్ “అబూతాలిబ్”[అ.స] మరణించారు.
9వ తారీఖు: హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో వేల సంఖ్యలో కూఫావాసులు ఇమామ్ హుసైన్[అ.స]కు ఉత్తరాలు వ్రాసేందుకు ఏకమయ్యారు.
10వ తారీఖు: హిజ్రత్ కన్నా మూడు సంవత్సరాల క్రితం జనాబె “ఖదీజా”[అ.స] మరణించారు.
3వ తారీఖు: హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో “తబూక్” యుద్ధం జరిగింది.
12వ తారీఖు: హిజ్రీ యొక్క మొదటి సంవత్సరంలో “ముహాజిరీన్” మరియు “అన్సారుల” మధ్య సౌదర్య ఒప్పందం(అఖ్దె ఉఖువ్వత్).
14వ తారీఖు: హిజ్రీ యొక్క 67వ సంవత్సరంలో జనాబె “ముఖ్తారె సఖఫీ” చంపబడ్డారు.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 3వ సంవత్సరంలో ఇమామ్ హసన్[అ.స] జన్మించారు. 60వ హిజ్రీలో “ముస్లిం ఇబ్నె అఖీల్”[అ.స] మక్కాకు ఇమామ్ హుసైన్[అ.స] రాయబారీగా ప్రయాణం మొదలు పెట్టారు.
17వ తారీఖు: హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో “బద్ర్” యుద్ధం జరిగింది.
19వ తారీఖు: హిజ్రీ యొక్క 40వ సంవత్సరంలో హజ్రత్ అలీ[అ.స]ను “ఇబ్నె ముల్జిమ్” గాయపరిచాడు.
20వ తారీఖు: హిజ్రీ యొక్క 8వ సంవత్సరంలో “ఫత్హె మక్కా” సంభవించింది. ప్రవక్త “మూసా[అ.స] ఇబ్నె ఇమ్రాన్”, “యూషా ఇబ్నె నూన్” లు మరణించారు మరియు హజ్రత్ ఈసా[అ.స] ఆకాశానికి చేరారు.
21వ తారీఖు: హిజ్రీ యొక్క 40వ సంవత్సరంలో హజ్రత్ అలీ[అ.స] మరణించారు.
25వ తారీఖు: హిజ్రీ యొక్క 38వ సంవత్సరంలో “నహ్రవాన్” యుద్ధం సంభవించింది.

రిఫ్రెన్స్
హౌజా నెట్, మునాసిబత్ హాయే మాహె రమజాన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya comment k zariye himmat afzaei karne ka. iltemase dua.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13