మంగళ, 05/22/2018 - 08:13
ఉపవాసం యొక్క ప్రభావం మానవుని శరీరం మరియు ఆత్మ పై కాకుండా మానవ సమాజానికి ఉపయోగపడే ప్రభావాలు కూడా ఉన్నాయి. వాటి నుండి కొన్ని.
1. మానవునిలో ఉండే దయాదాక్షిణ్యాలు మేలుకోవడం: మానవుడు ఉపవాసం ద్వారం పేదవారి ఆకలిని గ్రహించగలడు. వారిని సహాయం చేసి సమాజంలో పేదరికాన్ని తన స్థాయికి తగ్గట్టుగా తగ్గించవచ్చు.
2. అన్యోన్యసంబంధమను బలపరుస్తుంది: రమజాన్ మాసం యొక్క అనుగ్రములలో ఒకటి ముస్లిములలో అన్యోన్యసంబంధము. ఇతరుల కష్టాలను దూరం చేసే ప్రయత్నం.
3. సామూహిక సంకల్పాన్ని బలపరచడం: తనను గంటల తరబడి అన్నపానియాలకు దూరంగా ఉంచుకున్న వ్యక్తి మానవ సమాజం ఎదుగుదల కోసం సహనాన్ని చాలా సులభంగా ప్రదర్శించగలడు.
4. మంచి సమాజంగా తీర్చిదిద్దడం: ఉపవాసం అనగా కేవలం అన్నపానియాలకు దూరంగా ఉండడం కాదు. ప్రతీ చెడునుండి దూరంగా ఉండడం. ప్రతీ మనిషి సరిగ్గా ఉంటే ఆ సమాజం, మంచిసమాజంగా మారుతుంది.
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... jazakallah.
వ్యాఖ్యానించండి