కౌసర్ సూరహ్

బుధ, 05/23/2018 - 10:14

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 108వ సూరహ్ అయిన “కౌసర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

కౌసర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 108వ సూరహ్ ఇది. “కౌసర్” సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “కౌసర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 3 ఆయత్‍లు, 10 పదాలు మరియు 43 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఆదియాత్” సూరహ్ మరియు దీని తరువాత “తకాసుర్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “కౌసర్” కాకుండా “ఇన్నా అఅతైనా” అని కూడా అంటారు. “కౌసర్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “కౌసర్” అన్న పదం ఉండడం. ఈ సూరహ్ ఖుర్ఆన్ సూరహ్ లన్నీంటిలో కన్న అతి చిన్న సూరహ్. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ముస్తహబ్ లేదా వాజిబ్ నమాజులలో “కౌసర్” సూరహ్ ను పఠించేవారిని అల్లాహ్ “కౌసర్” సెలయేరు నుండి నింపుతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ458].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ458.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18