ఇఖ్లాస్ సూరహ్

శని, 05/26/2018 - 20:48

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 112వ సూరహ్, “ఇఖ్లాస్”. ఈ సూరహ్ ను “ఇఖ్లాస్” కాకుండా “తౌహీద్”, “అసాస్”, “తజ్రీద్”, “తఫ్రీద్”, “మారిఫత్”, “సమద్”, “నజాత్” మరియు “నిస్బతుర్రబ్” అని కూడా అంటారు. దాని సంక్షిప్త వివరణ.

ఇఖ్లాస్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 112వ సూరహ్ ఇది. “ఇఖ్లాస్” అనగా స్వచ్ఛత. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. “ఇఖ్లాస్” అన్న పదం ఈ సూరహ్ లో లేదు కాని ఈ సూరహ్ యొక్క ఇంకో పేరు “తౌహీద్” అనగ ఏకేశ్వరవాదం. ఈ సూరహ్ లో 4 ఆయత్‍లు, 15 పదాలు మరియు 47 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 2 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “నాస్” సూరహ్ మరియు దీని తరువాత “నజ్మ్” సూరహ్ అవతరించబడింది. “ఇఖ్లాస్” అనగా ప్రతీ మార్గభ్రష్టత నుండి దూరంగా ఉండడం, అనగా స్వచ్ఛట మరి ఈ సూరహ్ ను విశ్వసించే వారు ఎటువంటి తప్పుడు మార్గానికి వెళ్ళకుండా సురక్షితంగా ఉంటాడు అందుకే ఈ సూరహ్ ను “ఇఖ్లాస్” అని పేరు పెట్టారు. ఈ సూరహ్ యొక్క ప్రాముఖ్యత, ఈ సూరహ్ ను పఠించిన వారికి ఖుర్ఆన్ యొక్క 1/3 భాగం చదివినంత పుణ్యం ఇవ్వబడుతుంది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ఇఖ్లాస్” సూరహ్ ను పఠిస్తారో అతనికి అల్లాహ్, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు మరియు అంతిమదినం ను విశ్వసించే వారికి పది వంతుల పుణ్యం ప్రసాదించబడుతుంది.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ479].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ479.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6