ఇస్లామీయ సంవత్సరముల పేర్లు

ఆది, 10/15/2017 - 08:09

.అరబ్‌ దేశంలో ఆ రోజుల్లో ఏదైన ముఖ్యమైన లేక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగితే దాని తరువాత సంవత్సరములను ఆ సంఘటనను బట్టి పేరు పెట్టేవారు.

ఇస్లామీయ సంవత్సరముల పేర్లు

అరబ్‌ దేశంలో ఆ రోజుల్లో ఏదైన ముఖ్యమైన లేక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగితే దాని తరువాత సంవత్సరములను ఆ సంఘటనను బట్టి పేరు పెట్టేవారు.
కొన్ని సంవత్సరముల పేర్లు మరియు వాటి కారాణాలు:
1.ఆముల్ ఫీల్ (ఏనుగుల సంవత్సరం): “అబ్రహ” అనె ఒకరాజు తన కొన్ని వేల సైన్యాన్ని ఏనుగుల మీద “యమన్” నుండి మక్కాకి వచ్చీ “కాబా”ని ధ్వంసం చెయ్యాలని అనుకున్నాడు, ఆ సమయంలో అల్లాహ్ “అబాబీల్” అనె కొన్ని పక్షులను పంపి ఆ సైన్యాన్ని చాలా తక్కువ సమయంలో హతమార్చేటట్టు చేసెను. అప్పటి నుండి ఆ అరబీ సంవత్సరములను “ఆముల్ ఫీల్”(ఏనుగుల సంవత్సరం) అని పిలిచేవారు.
2. బేసత్ (ఎన్నుకో బడడం): హజ్రత్ ముహమ్మద్[స.అ] నలభై సంవత్సరాల వయసులో ప్రవక్తగా ఎన్నుకో బడ్డారో అప్పటి నుండి ఆ సంవత్సరములను “బేసత్” అని నామించారు.
3. ఆముల్ హుజ్‌న్ (దుఃఖ్ఖపు సంవత్సరం):        జనాబె అబూతాలిబ్[అ.స] మరియు జనాబె ఖదీజా[అ.స] ఏ సంవత్సరములో అయితె మరణించారో ఆ సంవత్సరమును మరియు దాని తరువాత సంవత్సరములను “ఆముల్ హుజ్‌న్” అని పిలిచేవారు. వాళ్ళ మరణం దైవప్రవక్త ముహమ్మద్(స.అ)ను చాలా దుఃఖ్ఖ భరితం చేసింది.
4. హిజ్రత్ (ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడం): కొంతమంది ప్రవక్త ముహమ్మద్[స.అ]ను హతమార్చాలని ఒకరోజును నిశ్చయించుకున్నారు. కాని అల్లాహ్, దైవప్రవక్త ముహమ్మద్[స.అ]కు వాళ్ళ యొక్క కట్ర గురించి తెలియ పరిచి మీరు అక్కడి నుండి మదీన వైపు ప్రయాణించండి అని ఆదేసించెను. ఆజ్ఞానూసారం హజ్రత్ ముహమ్మద్(స.అ) తన బదులుగా హజ్రత్ అలీ(అ.స)ను తమ పాన్పుపై పరుండ మని చెప్పి మదీనా వైపు బయలుదేరారు.
ఈ సంఘటన తరువాత ముస్లింల సంవత్సరం పేరు “హిజ్రత్”  అయినది. ఆ పేరు ఇప్పటి వరకు మిగిలి ఉంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya ....  hamare site par aakar mataalib ko padhne ka.....

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14