ఖుర్ఆన్ యొక్క 26వ పారహ్

బుధ, 07/04/2018 - 18:09

ఖుర్ఆన్ యొక్క 26వ పారహ్ లో ఆదు భాగాలున్నాయి: 1. పూర్తి అహ్ఖాఫ్ సూరహ్ 2. పూర్తి ముహమ్మద్ సూరహ్ 3. పూర్తి అల్ పత్హ్ సూరహ్ 4. పూర్తి హుజరాత్ సూరహ్ 5. పూర్తి ఖాఫ్ సూరహ్ 6. జారియాత్ సూరహ్ యొక్క మొదటి భాగం.

ఖుర్ఆన్ యొక్క 26వ పారహ్

మొదటి భాగంలో చాలా అంశాలున్నాయి: 1. తల్లిదండ్రుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలనే ఆదేశం. 2. గర్భం యొక్క అతి తక్కువ వ్యవధి 6 నెలలు 3. "ఆద్" సమూహం యొక్క పెంకితనం మరియు వారి శిక్ష ప్రస్తావనం 4. జిన్నాతుల విశ్వాసాలుగా మారే మరియు వారి సమూహంలో ప్రచారి(ఇస్లాం ఆహ్వాని)గా మారిన ప్రస్తావనం.
రెండవ భాగంలో చాలా అంశాలున్నాయి: 1. స్వర్గం యొక్క ఉపమానం. 2. మనిషి ధనం లేదా నాయకత్వం లేదా అధికారం పొందితే ఇక బంధుత్వాన్ని కొనసాగించలేడు 3. అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] పట్ల వ్యతిరేకత, చేసుకున్న ఆమాల్ ను వ్యర్థమౌతాయి. 
మూడవ భాగంలో చాలా అంశాలున్నాయి: 1. దైవప్రవక్త[స.అ] ను విశ్వసించిన, గౌరవించిన మరియు సహాయం చేసిన వారి ప్రస్తావనం 2. "హుదైబియహ్" సంధి యొక్క కొన్ని సందర్భాల వివరణ 3. దైవప్రవక్త[స.అ] యొక్క స్వప్న వివరణ.
నాలుగవ భాగంలో చాలా అంశాలున్నాయి: 1. నుబువ్వత్ మరియు రిసాలత్ యొక్క స్థానం 2. రెండు సమూహాల మధ్య సంధి చేయించే ప్రయత్నం మరియు విద్రోహులు రుజుమార్గం పొందేవరకు ఎదురించడం 3. సమాజాన్ని నాశనం చేస్తున్న కొన్ని గుణాల సూచన, వాటి నుండి సురక్షితంగా ఉండమనే ఆదేశం ఉదాహారణకు చాడీలు, అపనిందలు, చెడు పేర్లతో సంబోధించడం మొ..  
ఐదవ భాగంలో కూడా చాలా అంశాలున్నాయి: 1. మరణించిన మరలా ప్రళయం నాడు బ్రతికించబడతారు 2. కొన్ని సమూహాల దూషణ ప్రస్తావనం 3. నరకం యొక్క వైశాల్యం మరియు స్వర్గం యొక్క సామిప్య వివరణ 4. అంతిమ రోజు ఎలా ఆహ్వానించబడతారు, ముష్రికులను ఎలా కఠోరమైన శిక్షను విధిస్తారు అన్న ప్రస్తావనం.
ఆరవ భాగంలోని కొన్ని అంశాలు: 1. పాపాపుణ్యాలు లేక్కించబడతాయి, వాటి నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు 2. ధర్మనిష్ఠగలవారి కొన్ని స్వభావాల ప్రస్తావనం 3. ప్రవక్త ఇబ్రాహీమ్[అ.స] వద్దకు అతిథులు వచ్చే మరియు వారి ఆతిథ్య ప్రస్తానం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15