ఇహపరలోకాల భేదం

బుధ, 07/11/2018 - 13:07

ఇహపరలోకాలలో కొన్ని భేదాలు ఉన్నాయి వాటిని సంక్షిప్తంగా ఖుర్ఆన్ కూడా వివరించింది.

 ఇహపరలోకాల భేదం

1. సౌఖ్యాలు: “ఈ ప్రాపంచిక జీవిత సౌఖ్యాలు తాత్కాలికమైనవి” [గాఫిర్:39]. “పరలోకమే శాశ్వతంగా ఉండే నిలయం”[గాఫిర్:39]. “దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వితమైనది”[రఅద్:35]. “ఎన్నటికీ తరగని, మరెన్నటికీ ఆపుకోబడనివి(ఉంటాయి)”[వాఖిఅహ్:33].
2. కలిసిఉండడం: ఈ లోకంలో మంచివారు మరియు చెడ్డవారు కలిసి జీవిస్తారు కాని పరలోకంలో పాపాత్ములు వేరైపోతారు.[యాసీన్:59].
3. వ్యాజ్యం: ఈ లోకంలో మేము మా తరపు నుండి వాదించగలము, క్షమాపణ కోరగలము, కష్టాల నుండి పారిపోవచ్చు లేదా మన కర్తవ్యాల భారాన్ని ఇతరుల పై వేయవచ్చు కాని పరలోకంలో నోరు మెదపలేము. సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి కూడా వారికి ఇవ్వబడదు.[ముర్సలాత్:35,36]. “ఆ రోజు మానవుడు, ‘నేనెక్కడికి పారిపోను?’ అని అంటాడు. లేదు, ఎక్కడా ఏ ఆశ్రయమూ లేదు”[ఖియామహ్:10,11]. “బరువును మోసేవాడేవడూ మరొకరి బరువును మోయడు”[ఫాతిర్:18].
4. ఆశ్రయం: ఈ లోకంలో ఎవరినైనా ఆశ్రయించగలము లేదా ఎవరినైనా జామీనా ఇవ్వగలము, కాని ప్రళయంనాడు అలా జరగదు. “ఈ రోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయమూ పొందలేరు”[ము’మినూన్:65]. “ప్రతీ వ్యక్తీ తాను చెసుకున్న దానికి (తాను చేసిన కర్మలకు) ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు”[ముద్దస్సిర్:38].
5. కోరికలు: ఈ లోకంలో ఆశించినవన్నీ పొందలేకపోతాము “ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే మేము తలచిన వానికి తలచినంతగా ఇస్తాము”[ఇస్రా:18]. పరలోకంలో స్వర్గస్తులు తమ అభిలాషకు చేరుకుంటారు. “మనసు కోరేవీ, కళ్లు ఆస్వాదించేవీ అనీ అక్కడ ఉంటాయి”[జుఖ్రుఫ్:71].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8