దైవప్రవక్త[స.అ] అడిగిన ప్రశ్నకు సహాబీయులు సరైన జవాబు ఇవ్వలేకపోయారు. చిరికి దైవప్రవక్త[స.అ] యే సమాధానమిచ్చారు.
దైవప్రవక్త[స.అ] అడిగిన ప్రశ్నకు ఏ ఒక్కరూ సరైన జవాబు ఇవ్వలేకపోయారు. వారిచ్చిన జవాబులలో ఏదీ వారికి నచ్చలేదు. దైవప్రవక్త[స.అ]తమ సహాబీయులను అడిగిన ప్రశ్నేమిటంటే “ఈమాన్” కాపాడే అతిముఖ్యమైన విషయమేమిటి?. వారిలో ఒకరు “నమాజ్” అని అన్నాడు. దైవప్రవక్త[స.అ] కాదు అని అన్నారు. ఇంకొకడు “జకాత్” అన్నాడు. దైవప్రవక్త[స.అ] కాదు అన్నారు. మూడోవాడు “ఉపవాసం” అన్నాడు, నాలుగోవాడు “హజ్ మరియు ఉమ్రహ్” అన్నాడు, ఐదోవాడు “జిహాద్” అన్నాడు. దైవప్రవక్త[స.అ] అందరికి కాదు అనే జవాబిచ్చారు. చివరికి దైవప్రవక్త[స.అ]కు వారి నుండి సరైన సమాధానం లభించకపోవడంతో స్వయంగా వారే ఇలా సెవిచ్చారు: మీరందరు చెప్పినవన్నీ చాలా ఉత్తమమైనవి మరియు ప్రతిష్టత గలవి కాని నేను అడిగిన వాటి నుండి ఇవేమీ కావు. ఈమాన్ ను రక్షించేది “అల్లాహ్ కొరకు ఇష్టపడడం మరియు అల్లాహ్ కోసమే ద్వేషించడం”[కాఫీ, భాగం2, పేజీ25]
రిఫ్రెన్స్
కులైనీ, అల్ కాఫీ, బాబున్ అల్ హుబ్బు ఫిల్లాహి వల్ బుగ్జు ఫిల్లాహ్.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya... Iltemase dua.
Masha Allah, bohut qoob.
Jazakallah
Shukriya .. iltemase dua.
Mashaallah
Shukriya... jazakallah.
వ్యాఖ్యానించండి