.దైవప్రవక్త[స.అ] యొక్క 12 మంది ఉత్తరాధికారులు ఎవరి వంశానికి చెందిన వారో సంక్షిప్తంగా చెప్పబడినది.
దైవప్రవక్త ముహమ్మద్[స.అ] అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త. అల్లాహ్, వారికి మార్గదర్శి అంతిమ గ్రంథం అయిన ఖుర్అన్ మరియు అంతిమ ధర్మాన్ని ప్రసాదించి పంపెను. వారు ప్రచారించిన ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ఆ ప్రవక్త[స.అ] కు ఒక కుమార్తె ఆమె పేరు ఫాతెమా జహ్‌రా[స.అ]. ఆమెలో ఉండే ఉన్నత స్వభావాల వలన ప్రవక్త ముహమ్మద్[స.అ] అమెను ఆదరించేవారు, ఆమె ప్రవక్త[స.అ] వద్దకు వచ్చినప్పుడల్లా నిలబడి తమ కుమార్తేను గౌరవించేవారు. ఆమె వివాహం ప్రవక్త[స.అ] పినతండ్రి కుమారుడయిన హజ్రత్ అలీ[అ.స]తో జరిగింది. వారు ప్రవక్త[స.అ] తమ్ముడు మరియు అల్లుడే కాకుండా అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ ఇమామ్(మత నాయకుడు) మరియు దైవప్రవక్త యొక్క అసలైన ఉత్తరాధికారి. హజ్రత్ అలీ[అ.స] మరియు జనాబె ఫాతెమా జహ్‌రా[స.అ]లకు ఇద్దరు కుమారులు, ఇమామ్ హసన్[అ.స] మరియు ఇమామ్ హుసైన్[అ.స]. వారు దైవప్రవక్త అయిన ముహమ్మద్[స.అ] మనుమలు. ఇమామ్ హుసైన్[అ.స] తమ సోదరుడు ఇమామ్ హసన్[స.అ] తరువాత అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ ఇమామ్, ప్రవక్త గారి ఉత్తరాధికారి. ఆ తరువాత తొమ్మిది మంది ఉత్తరాధికారులు ఇమామ్ హుసైన్[అ.స] గారి సంతానం నుండే.
వ్యాఖ్యానించండి