ఇమామ్ అలీ[అ.స] యొక్క జియారత్ చదవవలసిన ప్రత్యేక రోజులు

ఆది, 07/15/2018 - 18:22

సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులలో హజ్రత్ ఇమామ్ అలీ[అ.స] యొక్క జియారత్ ను చదవమని సిఫారసు చేయబడి ఉంది. అలా చేయడం ద్వార చాలా పుణ్యం లభిస్తుంది. వారి దర్శనానికి వెళ్ళేవారు ఆ ప్రత్యేక రోజులలో అక్కడ ఉండేటట్లు చూసుకోవాలి. ఆ రోజులలో ఒకవేళ “నజఫ్” ఉండే భాగ్యం లేనప్పుడు దూరం నుండి కూడా వారి జియారత్ పత్రాన్ని చదవగలరు, ఇలా చేయడం కూడా పుణ్యానికి కారణం.

ఇమామ్ అలీ[అ.స] యొక్క జియారత్ చదవవలసిన ప్రత్యేక రోజులు

ఆ రోజుల క్రమం:
1. వారి జన్మదినం రోజు(రజబ్ నెల 13వ తారీఖు)
2. గదీర్ పండగ రోజు మరియు ముందు రోజు రాత్రి(జిల్ హిజ్ 18వ తారీఖు)
3. “హల్ అతా” సూరహ్ అవతరించన రోజు(జిల్ హిజ్ 25వ తారీఖు)
4. మబ్అస్ పండగ రోజు మరియు దాని ముందు రోజు రాత్రి(రజబ్ నెల 27వ తారీఖు)
5. వారు మరణించిన రోజు(రమజాన్ నెల 21వ తారీఖు)
6. “షబే హిజ్రత్”(రబీవుల్ అవ్వల్ మొదటి రోజు ముందు రాత్రి)
7. “బద్ర్” యుద్ధం రోజు(రమజాన్ నెల 17వ తారీఖు)
8. “ఒహొద్” యుద్ధం రోజు(షవ్వాల్ నెల 17వ తారీఖు)
9. “ఖైబర్” యుద్ధం రోజు
10. ఇమామ్ అలీ[అ.స] దైవప్రవక్త[స.అ] భుజాల పై ఎక్కి విగ్రహాలను నాశనం చేసిన రోజు(రమజాన్ నెల 20వ తారీఖు)
11. “ఫత్హె బస్రా” రోజు (జుమాదల్ అవ్వల్ నెల మధ్య రోజు)
12. “రద్దుష్షమ్స్” అనగ సుర్యుడు తిరిగి వచ్చిన రోజు(షవ్వాల్ నెల17వ తారీఖు)
13. బరాఅత్ ఆయత్ ను ప్రచారించడానికి నియమించబడిన రోజు(జిల్ హిజ్ నెల మొదటి తారీఖు)
14. ఇమామ్ అలీ[అ.స] ఇంటి తలుపులు తప్ప అందరి ఇంటి తలుపులు మస్జిదున్నబీ వైపుకు మూసేయమని అల్లాహ్ దైవప్రవక్త[స.అ]కు ఆదేశించిన రోజు(అరఫహ్ రోజు).
15. నమాజ్ చదువుతూ జకాత్ ఇచ్చిన రోజు అదే రోజు ముబాహలా రోజు కూడాను(జిల్ హిజ్ నెల 24వ తారీఖు)
16. వారి వివాహం రోజు
17. వారి ఖిలాఫత్ పదవీ కాలం మొదలైన రోజు; అనగా దైవప్రవక్త[స.అ] మరణించిన రోజు(సఫర్ నెల 28వ తారీఖు)
18. ప్రజలు బహిరంగంగా వారి బైఅత్ చేసిన రోజు(జిల్ హిజ్ యొక్క 18 లేదా 25వ తారీఖు)
19. “నౌరోజ్ రోజు”, ఆ రోజు ఆయన బైఅత్ చేయబడిన రోజు.[బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ354]

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బాబొ జియారాతిహి సలావాతుల్లాహి అలైహిల్ ముఖ్తస్సిహి బిల్ అయ్యామి వల్లయాలీ.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9