మర్హూమ్ కులైనీ[ర.అ]

శని, 07/21/2018 - 17:59

షియా ముస్లిముల హదీస్ మూల గ్రంథాలలో ఒకటైన అల్ కాఫీ గ్రంథ రచయిత అయిన మర్హూమ్ కులైనీ[ర.అ] గురించి సంతక్షిప్త వివరణ.

మర్హూమ్ కులైనీ[ర.అ]

పేరు ముహమ్మద్ ఇబ్నె యాఖూబె కులైనీ, “సిఖతుల్ ఇస్లాం కులైనీ” అని పిలవబడేవారు. వారి గురించి చరిత్ర పుస్తకాలలో అంతగా వ్రాసిలేదు. అయినప్పటికీ మన ఉలమాలు వారి గురించి అన్వేషించి ఎంతోకంత తెలుసుకున్నారు. మర్హూమ్ కులైనీ[ర.అ] పన్నెండవ ఇమామ్ యొక్క ప్రత్యేక ప్రతినిధుల కాలంలో జన్మించారు, వారు జన్మించిన తారీఖు ఎక్కడా లిఖించబడి లేదు కాని వారు హిజ్రీ యొక్క 328 లేదా 329వ సంవత్సరంలో మరణించారు అని ఉంది. వారు “కులైన్” అనబడే ఒక గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం ఇరాన్ లో ఉన్న “షహ్రె రయ్” నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంతకాలం కులైన్ గ్రామంలోనే షియాల పై నాయకత్వం వహించి ఆ తరువాత “బగ్దాద్”కు వెళ్ళిపోయారు అక్కడ కూడా విధ్యాబోధన చేయడం మొదలు పెట్టారు. అందరూ వారిని చాలా నమ్మేవారు. కొందరైతే వారిని “హిజ్రీ యొక్క 3వ శతాబ్ధంలో షియా వర్గానికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి” అనే వారు.
మర్హూమ్ కులైనీ[ర.అ] బగ్దాద్ లోనే మరణించారు. వారిని బాబుల్ కూఫాలో సమాధి చేశారు. వారి దర్శనానికి షియా ముస్లిమూలే కాకుండా అహ్లె సున్నత్ వర్గం వారు కూడా వస్తారు.[ఖదమాతె ముతఖాబిలె ఇస్లాం వ ఇరాన్, పేజీ480].

రిఫ్రెన్స్
ఖదమాతె ముతఖాబిలె ఇస్లాం వ ఇరాన్, షహీద్ ముతహ్హరీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17