.అలీ[అ.స] యే సహాబీయులందరిలో ఉత్తములు మరియు నాయకత్వానికి అర్హులు అన్న అంశం పై అల్లాహ్ నిదర్శనం.
వాస్తవానికి హజ్రత్ అలీ(అ.స), అందరిలో కన్న జ్ఞానవంతులు, అందరి కన్న ధైర్యవంతులు, అందరి కన్న బలవంతులు అని సాధారణ వ్యక్తి నుండి ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరు నమ్ముతారు. అందులో కనీసం ఇద్దరు వ్యక్తులలో కూడా అభిప్రాయభేదం కనిపించదు. హజ్రత్ అలీ(అ.స) విలాయత్‌ని నిరూపించే నుసూస్ ఉదా: గదీర్ మొ॥ లాంటివి చూసీచూడనట్లు వదిలేసినా కూడా ఖుర్ఆన్ దృష్టిలో ఇమామత్ మరియు నాయకత్యానికి జ్ఞాని, దైర్యశాలి, శక్తివంతుడు అయ్యి ఉండాలి.
అందుకే ఖుర్ఆన్ ఉలమాల ఆచరణ విషయంలో ఇలా ప్రవచించింది:
أَفَمَن يَهۡدِيٓ إِلَى ٱلۡحَقِّ أَحَقُّ أَن يُتَّبَعَ أَمَّن لَّا يَهِدِّيٓ إِلَّآ أَن يُهۡدَىٰۖ فَمَا لَكُمۡ كَيۡفَ تَحۡكُمُونَ
అనువాదం: అలాంటప్పుడు మీరే చెప్పండి, సత్యం వైపునకు మార్గం చూపేవాడా విధేయతకు ఎక్కువ అర్హుడు? లేక తనకు ఎవడైనా మార్గం చూపితే తప్ప స్వయంగా మార్గాన్ని పొంద లేనివాడా? అసలు మీకేమయింది, ఇటువంటి తలకిందుల నిర్ణయాలు చేస్తున్నారు? [యూనుస్ సూరా:10, ఆయత్:35]
వ్యాఖ్యలు
Mashaallah
Jazakallah...
بہت اچھے انداز میں پیش کیا ہے
Shukriya, himmat afzaei ka..
వ్యాఖ్యానించండి